Yuvraj Singh Balakrishna: బాల‌కృష్ణ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన యువ‌రాజ్ సింగ్‌.. బాల‌య్య‌తో దిగిన ఫొటోను..

Yuvraj Singh Balakrishna: న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నేటితో (గురువారం) 61 ఏళ్లు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. తెలుగు చిత్ర సీమ‌లో ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాల‌కృష్ణ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని...

Yuvraj Singh Balakrishna: బాల‌కృష్ణ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన యువ‌రాజ్ సింగ్‌.. బాల‌య్య‌తో దిగిన ఫొటోను..
Yuvaraj Singh Balarishna

Updated on: Jun 10, 2021 | 3:24 PM

Yuvraj Singh Balakrishna: న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నేటితో (గురువారం) 61 ఏళ్లు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. తెలుగు చిత్ర సీమ‌లో ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాల‌కృష్ణ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని ఆయ‌న అభిమానుల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. సినిమా నుంచి రాజ‌కీయ నాయ‌కులు వ‌ర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్‌లు చేస్తున్నారు.
ఈ క్ర‌మంలోనే తాజాగా టీమిండియా మాజీ ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్ బాల‌కృష్ణ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. హైద‌రాబాద్ వ‌చ్చిన సంద‌ర్భంలో బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రిలో బాల‌కృష్ణతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. హ్యాపీ బ‌ర్త్ డే బాల‌కృష్ణ సార్‌. మీ నటనతో, మానవతా దృక్పథంతో మీరు చేస్తున్న సేవ నిస్వార్థంగా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను.. అంటూ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపాడు. టీమిండియా ప్లేయ‌ర్ బాల‌కృష్ణ‌కు విషెస్ చెప్ప‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే క్యాన్స‌ర్ బారిన ప‌డిన యువ‌రాజ్ సింగ్‌.. మొక్క‌వోని దీక్ష‌తో క్యాన్స‌ర్‌ను జ‌యించిన విష‌యం తెలిసిందే.

యువ‌రాజ్ సింగ్ చేసిన ట్వీట్‌..

Also Read: COVID Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న చోట బల్బ్ పెడితే వెలుగుతున్న వైనం.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం

Nandamuri Balakrishna: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న నందమూరి అభిమానులు.. అఖండ న్యూ పోస్టర్ వైరల్..

Ramdev : కొవిడ్ వ్యాక్సిన్ పైన దుమారాన్ని లేపిన రాందేవ్ బాబా యూటర్న్.. నా పోరాటం వైద్యులపై కాదు డ్రగ్‌మాఫియా పైనే అని వెల్లడి