బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు.. మరో వీడియో వదిలిన అన్వేష్..

హిందూ దేవతలు, తెలుగు ప్రవచనకర్తపై అనుచిత కామెంట్స్ చేశాడంటూ యూట్యూబర్ అన్వేష్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. అతడ్ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయాలని.. యూట్యూబ్‌లో అన్ సబ్‌స్రైబ్ చేయాలని పిలుపునిస్తున్నారు. అందుకే తగ్గట్లుగానే అతడ్ని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది.

బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు.. మరో వీడియో వదిలిన అన్వేష్..
Naa Anveshana

Updated on: Jan 02, 2026 | 11:08 AM

ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకునే యూట్యూబర్ అన్వేష్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్‌ చేసేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్‌లోడ్‌ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులూ సంపాదిస్తున్నాడు అన్వేష్‌. అయితే  మొన్నామధ్య బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను బయట పెట్టాడీ ఫేమస్ యూట్యూబర్. ఆ తర్వాత ఇప్పుడు ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నాడు. హిందూ దేవతలు, తెలుగు ప్రవచనకర్తపై అనుచిత కామెంట్స్ చేశాడంటూ అన్వేష్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. దీని పై అన్వేష్ పై ట్రోలింగ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో అతడ్ని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది.

అన్వేష్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దేవీ దేవతలను దూషించారంటూ పంజాగుట్ట PSలో ప్రముఖ నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో BNSలోని సెక్షన్‌ 352, 79, 299లతోపాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్‌ కింద అన్వేష్‌పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్‌కి నోటీసులు పంపనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్‌పై తెలంగాణలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అతడిని భారత్‌కు రప్పించాలని హిందూసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా అన్వేష్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన అన్వేష్.. రాత్రి ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చాడు.. వినాయకుడు నీ దగ్గర ఉన్నాడు కదా.. వాళ్ల తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామినిని పెట్టుకో  నీకు విజయాలు కలుగుతాయని చెప్పాడు. నన్ను కొన్నాళ్లు ట్రావెలింగ్ పక్కనపెట్టి ప్రజా సమస్యలపై పోరాడమన్నాడు.  ఒక పది వాక్యాలు చెప్పాడు .. కషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల అంతు చూడమని చెప్పాడు. బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు. కొందరు స్వామి మాల వేసుకొని మోసం చేస్తున్నారు. వాళ్ల సంగతి కూడా చూడమని చెప్పాడు.. సీతమ్మని ఎవరైనా ఏమైనా అంటే చూసుకోడానికి నేనున్నాను కదా.. నువ్వు మంచోడివి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అన్నీ ఆపేసావ్ కదా.. వాళ్లందరికీ డబ్బులు లేవు. ఎప్పుడు దొరుకుతావా అని గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు.. వాళ్ళే నిన్ను ఇరికించారు అని చెప్పాడు. కానీ బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై పోరాడమని చెప్పాడు. అందుకే 2026లో బూతులు మాట్లాడనని ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నా. ఒకవేళ బూతులు మాట్లాడితే నన్ను మీరు చెప్పు తీసుకొని కొట్టండి. ఈ ఏడాది ప్రజా సమస్యలపై, ముఖ్యంగా ఆడవారి సమస్యలపై పోరాటం చేస్తా.. భారతదేశంలో స్త్రీలకి స్వేచ్ఛ లేదని, అందుకే వారి తరపున పోరాటమని దేవుడు నాతో చెప్పాడు అంటూ అన్వేష్ వీడియో షేర్ చేశాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.