ఎఫ్ఐఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు యంగ్ హీరో విష్ణు విశాళ్ (Vishnu Vishal).. మాస్ మహారాజా రవితేజ సమర్పణలో హీరో విష్ణు విశాల్ నటించిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ సంపాదించుకుంది. ఈ మూవీలో నటన పరంగా విష్ణు విశాల్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం తర్వాత రవితేజ, విష్ణు విశాల్ కలిసి RT టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై మరో కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సినిమాకు దర్శకుడు చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు మట్టి కుస్తీ అని టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా మంగళవారం నాడు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో ప్రేక్షకులతో నిండిన ఆట స్థలం కనిపిస్తుంది. టైటిల్ సూచించినట్లుగా, మట్టి కుస్తీ క్రీడ రెజ్లింగ్ ఆధారంగా రూపొందించబడింది. ఇది స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందనుంది. విష్ణు విశాల్ విభిన్నమైన కాన్సెప్ట్‌తో అంతే భిన్నమైన నటనతో చిత్రాలు చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన ఓ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్‌గా రిచర్డ్ ఎం నాథన్ వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం కానున్నదని మేకర్స్ తెలియజేశారు.
I always love films centered around sports 🙂
Happy to present such a sports drama which is high on entertainment .
Here’s #MattiKusthi Motion Poster !@TheVishnuVishal @RTTeamWorks @ChellaAyyavu @VVStudioz pic.twitter.com/1YutNmIwZX
— Ravi Teja (@RaviTeja_offl) April 5, 2022
Also Read: Rashmi Gautam: యాంకరమ్మ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. రష్మీ లేటెస్ట్ ఇమేజెస్
Rashmika Mandanna: బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీవల్లి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..
Samantha-Yashoda: యశోద సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..
Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‌పుల్ యాక్షన్‌తో అదరగొట్టిన విజయ్ దళపతి..