నేను 21 ఏళ్లకే వచ్చేసాను.. కానీ కరెక్ట్ ఏజ్ ఇదే.. యంగ్ హీరో రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఛాంపియన్' లో యాక్షన్ డ్రామా వార్ అద్భుతంగా ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని హీరో రోషన్. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇప్పటికే హీరోగా సినిమాలు చేశాడు. గతంలో నిర్మలాకాన్వెంట్ అనే సినిమా చేశాడు. అలాగే పెళ్ళిసందడి అనే సినిమా చేశాడు.

నేను 21 ఏళ్లకే వచ్చేసాను.. కానీ కరెక్ట్ ఏజ్ ఇదే.. యంగ్ హీరో రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Roshan Meka

Updated on: Dec 20, 2025 | 9:51 PM

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్ గారు మిమ్మల్ని చాలా ప్రశంసించారు కదా.. ఎలా అనిపించింది.? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. చాలా ఆనందంగా ఉంది. చరణ్ అన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా గురించి మా సినిమా గురించి టీం గురించి ఆయన చాలా బాగా మాట్లాడారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. 1948లో జరిగే కథ ఇది.. యాక్షన్ డ్రామా వార్ అన్ని చాలా గ్రాండ్ గా ఉంటాయి. చరిత్రలో బైరాన్ పల్లి గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఈ కథని ప్రజెంట్ చేయడం జరిగింది. నేను మామూలుగా తెలుగు మాట్లాడతాను. అయితే ఈ క్యారెక్టర్ ప్రాపర్ హైదరాబాది. ఆ యాస స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది. మా డైరెక్టర్ హెల్ప్ తో పాటు వర్క్ షాప్స్ కూడా చేశాం అన్నారు రోషన్.

నిజానికి హీరోలందరూ 25 ఏళ్లు ఏజ్ లోనే వస్తారు. నేను 21 ఏళ్లకే వచ్చేసాను. బ్రేక్ లాగా అనిపిస్తుంది కానీ కరెక్ట్ ఏజ్ ఇదే. కం బ్యాక్ ఇవ్వడానికి ఇదే కరెక్ట్ ఏజ్. ఈ గ్యాప్ తీసుకోవడం కూడా కంప్లీట్ గా నా నిర్ణయమే. యాక్టింగ్ అంటే చాలా హ్యూమన్ ఎమోషన్స్ తెలియాలి. దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. ఈ మూడేళ్లలో చాలా ట్రావెల్ చేశాను. చాలా నేర్చుకున్నాను. ఈ మూడేళ్లు చాలా హ్యాపీగా జరిగింది. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్ కి స్వతంత్రం రాని రోజుల్లో జరిగిన కథ ఇది. మా డైరెక్టర్ గారు అన్ని రిఫరెన్సులు ఇచ్చారు. స్వప్న గారు చాలా పర్టికులర్ గా ఉంటారు. డైరెక్టర్ గారు, స్వప్న గారు, ఆర్ డైరెక్టర్ తోట గారు ప్రతిదీ రీసెర్చ్ చేశారు. ఆ కాలంలో ఎలా ఉండేవారు డైరెక్టర్ గారు ప్రతీది కేర్ తీసుకుని చేశారు. ఈ సినిమా కోసం చాలా వర్క్ షాపులు కూడా చేశాము. ఇందులో అద్భుతమైన డ్రామా ఉంది. ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. హాలీవుడ్ లో స్పైడర్ మాన్ లాంటి సినిమాలు దాదాపు 3000 కోట్లు పెట్టి తీస్తారు కానీ అందులో ఒక కొత్త నటుడు ఉంటాడు. ఖర్చు పెట్టేది సినిమా మీద. అంత స్ట్రాంగ్ సబ్జెక్టు ఉంది కాబట్టే అంత పెట్టారు. ఒత్తిడి ఉంటుంది. అయితే నేను దృష్టి పెట్టాల్సింది యాక్టింగ్ పైనే. నేనొక్కడినే కాదు బైరాన్ పల్లి గ్రామంలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక ప్రారంభం ముగింపు ఉంటుంది. ఇక తర్వాత సినిమాల గురించి మాట్లాడుతూ.. ఈసారి ఎక్కువ గ్యాప్ లేకుండా కనీసం రెండు సంవత్సరాలకి మూడు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు రోషన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.