
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జానపదాలు, పౌరాణికాల్లో నటించాలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత కాంతారావే. ముఖ్యంగా అద్భుతమైన కత్తి విన్యాసాలకు ఆయన బాగా ఫేమస్. అందుకే చాలా మంది ఆయనను కత్తి కాంతారావు అని పిలిచేవారు. సిల్వర్ స్క్రీన్ పై అగ్ర హీరోగా వెలిగిన ఆయన జీవిత చరమాంకంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక కాంతారావు చనిపోయాక ఆయన కుటుంబ పరిస్థితి కూడా మరింత ఘోరంగా తయారైంది. ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కాంతారావు కుమారుడు రాజేశ్వరరావుకి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేసిన అవార్డుల్లో భాగంగా రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు యండమూరి వీరేంద్రనాథ్. అయితే పురస్కారం అందుకుంటోన్న సమయంలోనే బహుమతి మొత్తంలో కొంత భాగాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని యండమూరి చెప్పారు. అలా చెప్పినట్లుగానే ఇప్పుడు బహుమతి మొత్తంలో నుంచి లక్ష రూపాయలు కాంతారావు కుమారుడికి అందజేశారు. ఈ సందర్భంగా తన ఇంటికి పిలిపించుకుని రూ.లక్ష చెక్కు అందజేశారు యండమూరి.అలాగే కడపకు చెందిన ఆర్తి ఫౌండేషన్‌కు రూ.3లక్షలు, శ్రీకాకుళంలో పేద, అనాథ విద్యార్థులకు సాయం చేసే అభయం ఫౌండేషన్‌కి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు వీరేంద్ర నాథ్. దీంతో ఈ దిగ్గజ రచయితపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
‘ తెలంగాణ ప్రభుత్వం కాంతారావు గారి పేరుమీద అవార్డు ఇస్తుందని తెలిసి ఫంక్షన్ చూడటానికి రమ్మని వారి కుటుంబానికి వెయ్యి రూపాయలు పంపించాను. అయితే కాంతారావు గారి కుమారుడు ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసి చాలా బాధపడ్డాను. నేను అవార్డు అందుకున్న వెంటనే ఆయన్ని మా ఇంటికి పిలిచి లక్ష రూపాయలు ఇచ్చాను’ అని యండమూరి చెప్పుకొచ్చారు.
•Nagi Reddy & Chakrapani Film Award – Atluri Poornachandra Rao
•Raghupathi Venkaiah Award – Yandamoori Veerendranath pic.twitter.com/ONroeKOfQi
— Surya Reddy (@jsuryareddy) June 15, 2025
కాగా గద్దర్ సినీ అవార్డుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ వ్యక్తుల పేరిట స్పెషల్ జ్యురీ అవార్డులు ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఎస్ కాంతారావు పేరుతో అవార్డును హీరో విజయ్ దేవరకొండకి అందజేసిన తెలంగాణ ప్రభుత్వం అతనికి రూ.10లక్షల నగదు కూడా ఇచ్చింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..