RGV: వర్మ ఏంటి మాకీ ఖర్మ..! ఏకిపారేస్తున్న నెటిజన్స్.. అసలు ఏమైందంటే

|

Mar 18, 2025 | 2:53 PM

సంచలన డ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మొన్నటివరకు కాంట్రవర్సీలతో సావాసం చేసిన వర్మ ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. మొన్నామధ్య మంచి సినిమాలు చేస్తా అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆర్జీవీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ శారీ. ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

RGV: వర్మ ఏంటి మాకీ ఖర్మ..! ఏకిపారేస్తున్న నెటిజన్స్.. అసలు ఏమైందంటే
Rgv
Follow us on

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ.. అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఆర్జీవీ ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇటీవలే రామ్ గోపాల్ వర్మ పోలీసు కేసులో చిక్కుకొని బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పై పలు కేసులు నమోదు అయ్యాయి.

ఇదిలా ఉంటే దేనికి భయపడని ఆర్జీవీ.. తన మనసులో మాట కూడా మొఖంమీద చెప్పేస్తారు. ముక్కుసూటిగా మాట్లాడతారు ఆర్జీవీ. తాజాగా ఆయన అమ్మాయిల్లో మీకు ఇష్టమైన బాడీ పార్ట్ ఏంటి అంటే షాకింగ్ సమాధానం చెప్పారు.దాంతో అందరూ షాక్ అయ్యారు. ఇంతకూ అర్జీవిని ఆ ప్రశ్న అడిగిన అమ్మాయి ఎవరో తెలుసా.? నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే..

తాజాగా అర్జీవిని ఓ సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ కలిసింది. ప్రత్యుష అనే సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ అర్జీవిని కలిసింది. అయితే ఆమె రామ్ గోపాల్ వర్మను.. మీరు ఎంతోమంది అమ్మాయిలను చూసేఉంటారు. అమ్మాయిల్లో నచ్చే బాడీ పార్ట్ ఏంటి.? అని ప్రశ్నించింది. దానికి ఆర్జీవీ నిజం చెప్పాలా లేక అబద్దం చెప్పాలా.? అని అడగ్గా ఆమె నిజమే చెప్పాలి అంది. దాంతో మీరు దీనిని మంచిగా తీసుకోండి అంటూ.. అసభ్యకర సమాధానం చెప్పారు ఆర్జీవీ. దాంతో ఆమె సిగ్గుకూడా పడినట్టు ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్స్ కామెంట్స్ మాములుగా లేవు. ఒకొక్క కామెంట్ ఒకొక్క డైమండ్ అంతే. దాంతో కామెంట్స్ ను హైడ్ చేసింది ఆమె.. “బిగ్ బాస్ సీజన్ 9కు కంటెస్టెంట్ ఫిక్స్” అని కొందరు. “ఎవర్ని పట్టుకొని ఏం అడుగుతున్నావు” అని మరికొందరు కామెంట్స్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి