అందాల భామ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది. రీసెంట్ గా సమ్ విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. సమంత తెలుగు సినిమాలతో పాటు తమిళ్ లోనూ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది సమంత. తక్కువ సమయంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించింది ఈ చిన్నది. అలాగే వరుణ్ ధావన్ తో ఓ సినిమా. ప్రియాంక చోప్రాతో కలిసి సె టాడీయల్ లాంటి వాటిలో నటించింది. ఇక ఇప్పుడు సామ్ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని ఆరోగ్యం పై దృష్టి పెట్టింది.
సమంత ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఏకంగా ఈ అమ్మడి ఓ భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సామ్ సినిమా చేస్తుందని తెలుస్తోంది. ఖుషి సక్సెస్ మీట్ సమయంలో సామ్ ముంబై వెళ్లిందని తెలుస్తోంది. ఆ సమయంలో కరణ్ జోహార్ ఆమెతో కలిసి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్ తో చేస్తున్న సినిమా గురించి అందులో హీరోయిన్ గా చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి కరణ్ జోహార్ పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
కరణ్ జోహార్ యాజమాన్యంలోని ధర్మ ప్రొడక్షన్స్‌తో సల్మాన్ ఖాన్ సినిమా చేయనున్నాడు. ఇటీవలే సల్మాన్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో నటించేందుకు సమంతకు ఆఫర్ ఇచ్చాడట కరణ్. సామ్ కూడా ఈ సినిమా చేస్తానని ఒప్పుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. అయితే సామ్ కు సంబంధించిన షూటింగ్ కు టైం పడుతుందని తెలుస్తోంది. సామ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా మారాలని చూస్తుంది. సల్మాన్ ఖాన్ తో నటిస్తే హిందీలో సమంత డిమాండ్ పెరుగుతుంది. ఇదిలా ఉంటే జవాన్’ సినిమాలో సమంత నటించాల్సి ఉందట. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. ఆ తర్వాత సమంత స్థానంలోకి నయనతార వచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత దీపిక పోషించిన పాత్రలో కూడా సమంతకు ఆఫర్ చేసినట్లు సమాచారం. దానికి కూడా సామ్ నో చెప్పిందట. ఇప్పుడు ఆమె సల్మాన్ ఖాన్‌తో నటించేందుకు ఓకే చెప్పిందని బీటౌన్ లో టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.