
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేశాడు అల్లు అర్జున్ . గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైంది పుష్ప2 సినిమా. టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ. 2000 కోట్లకు పైగా వసూలు చేసి, ఇండియన్ సినిమాల్లో రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు పుష్ప 2 తర్వాత అల్లుఅర్జున్ నెక్స్ట్ సినిమా పై ఆసక్తి పెరిగిపోయింది. అల్లు అర్జున్ ఇప్పుడు దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించే కొత్త చిత్రానికి గ్రీన్ సింగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
జవాన్ సినిమాతో అట్లీ భారీ విజయాన్ని అందుకున్నాడు. జవాన్ సినిమా రూ. 1,100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ బాక్సాఫీస్ విజయం తర్వాత, ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అట్లీ. అల్లు అర్జున్ సినిమా చాలా గ్రాండ్ కథాంశంతో రూపొందుతోందని తెలుస్తుంది.తమిళ, హిందీ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ సినిమాతో దర్శకుడు అట్లీ టాలీవుడ్‌లో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు మరో నటుడు కూడా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ నటుడు శివకార్తికేయన్. అల్లు అర్జున్ సినిమాలో శివ కార్తికేయన్ నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటి జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే టాక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.అమరన్ తర్వాత నటుడు శివకార్తికేయన్ మదరాసి, పరాశక్తి వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే ఇప్పుడు అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..