
కేజీఎఫ్ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు హీరో యశ్. కేజీఎఫ్ 1, 2 రెండు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో యశ్ నెక్స్ట్ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే యశ్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం యశ్ టాక్సిక్ అనే సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాపై అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటంతో అభిమానులు ప్రతి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ ‘టాక్సిక్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్‌ను విడుదల చేస్తూ చిన్న టీజర్ ను కూడా వదిలారు. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. సాయి పల్లవి, శృతి హాసన్‌లను చిత్ర బృందం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు.
సాయి పల్లవి మంచి నటి అనడంలో సందేహం లేదు. అలాగే శ్రుతి హాసన్‌ని అందరికి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ‘టాక్సిక్’ సినిమాలో భాగం కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ రూమర్ల పై క్లారిటీ రాదు అంటున్నారు నెటిజన్స్. ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఇన్సిడెంట్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.