Thalapathy Vijay: దళపతి విజయ్ 68లో సీనియర్ హీరోయిన్.. పవర్ ఫుల్ పాత్రలో ఆమె..

|

Dec 26, 2023 | 4:42 PM

లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు దళపతి 68 పై ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. దళపతి విజయ్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారట వెంకట్ ప్రభు. అంతే కాదు ఈ సినిమాలో దళపతి విజయ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

Thalapathy Vijay: దళపతి విజయ్ 68లో సీనియర్ హీరోయిన్.. పవర్ ఫుల్ పాత్రలో ఆమె..
Thalapathy Vijay
Follow us on

దళపతి విజయ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాల్లో లియో సినిమా పర్లేదు అనిపించుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన లియో సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు దళపతి 68 పై ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. దళపతి విజయ్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారట వెంకట్ ప్రభు. అంతే కాదు ఈ సినిమాలో దళపతి విజయ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

విజయ్ తండ్రి కొడుకు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారని తెలుస్తోంది. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, యోగిబాబు, కిచ్చా సుదీప్‌ ఇలా చాలా మంది ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. వీరితో పాటు మరో సీరియర్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించనుందని తెలుస్తోంది.

ఆమె మరెవరో కాదు.. దళపతి విజయ్ 68 సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ చాలా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అయ్యారు. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు దళపతి 68లో నటించనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చైన్నెలో ప్రారంభమై థాయిలాండ్‌, టర్కీ, హైదరాబాద్‌‌లో జరిగిందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుందని తెలుస్తోంది.

వెంకట్ ప్రభు ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.