Actress Rambha: రీ ఎంట్రీ ఇవ్వనున్న రంభ.. స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర.?

|

Nov 01, 2023 | 10:53 AM

ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను ఊపేసిన నటీమణుల్లో రంభ ఒకరు. నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో రంభ తన నటనతో పాటు అందాలతో కవ్వించింది. ఆతర్వాత రంభ వరుస సినిమాలతో బిజీ అయిపొయింది ఈ బ్యూటీ. రంభ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రంభ. అప్పట్లోనే అందాలు ఆరబోసి కుర్రకారుకు కిర్రెక్కించారు రంభ.

Actress Rambha: రీ ఎంట్రీ ఇవ్వనున్న రంభ.. స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర.?
Rambha
Follow us on

ఇప్పటికే చాలా మంది సీనియర్ బ్యూటీలు ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన వారు కూడా ఇప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా రీఎంట్రీ ఇవ్వనుంది. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను ఊపేసిన నటీమణుల్లో రంభ ఒకరు. నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో రంభ తన నటనతో పాటు అందాలతో కవ్వించింది. ఆతర్వాత రంభ వరుస సినిమాలతో బిజీ అయిపొయింది ఈ బ్యూటీ. రంభ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రంభ. అప్పట్లోనే అందాలు ఆరబోసి కుర్రకారుకు కిర్రెక్కించారు రంభ. రంభ అసలు పేరు విజయలక్ష్మి. అయితే మొదటి సినిమా దర్శకుడు అయిన ఈవీవీ సత్యనారాయణ ఆమె పేరును రంభగా మార్చారు. తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు రంభ. అదేవిధంగా హీరోయిన్ గా నే కాకుండా స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి అదరగొట్టారు రంభ.

పెళ్లి తర్వాత రంభ సినిమాలకు దూరమయ్యారు. మలేషియా వ్యాపారవేత్తను ఈ బ్యూటీ వివాహం చేసుకున్నారు. వయసు పెరుగుతున్నా కూడా తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు రంభ. ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కానున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పుడు రంభ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్ బడా హీరో సినిమాలో కీలక పాత్రలో రంభ కనిపించనున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సీనియర్ హీరోయిన్స్ లో రాశి, ఆమనీ, ఇంద్రజ,కుష్బు లాంటి వారు రీ ఎంట్రీలు ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి భాటలోనే రంభ కూడా సినిమాల్లో నటించనున్నారని టాక్ వినిపిస్తుంది.

రంభ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.