ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమ కథ సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాంటి వాటిలో సీతారామం సినిమా ఒకటి. హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన సీతారామం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీతారామం సినిమాలో సీత మహాలక్ష్మీ పాత్రలో చూడచక్కగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది మృణాల్. అలాగే రామ్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు. మొత్తంగా సీతారామం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు వేలంటైన్స్ డే సందర్భంగా సీతారామం సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో మృణాల్ కు తెలుగులో భారీ హిట్ తో పాటు మంచి క్రేజ్ కూడా లభించింది. ఇక ఇప్పుడు ఈ భామ తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.
అయితే ఈ సూపర్ హిట్ సినిమాను ఒక స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ పూజాహెగ్డే. మొన్నటి వరకు పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ వరుసగా సినిమాలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది. స్థార్ హీరోల సరసన సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే. వరుస ప్లాప్స్ తో సతమతం అయ్యింది.
దాంతో పూజా కు ఆఫర్స్ తగ్గాయి. ఈ అమ్మడు ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తుంది. అయితే ఈ చిన్నది సీతారామం సినిమాను మిస్ చేసుకుందట. అయితే దర్శకుడు హనురాఘవాపుడి ముందుగా సీత పాత్రలో పూజా ను ఎంపిక చేశాడట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేశాడట. అయితే ఆ తర్వాత అప్పటికే స్టార్ అయిన పూజా ఈ పాత్రలో సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ వచ్చిందట. కొత్త అమ్మాయి అయితే చక్కగా సెట్ అవుతుందని పూజా హెగ్డేను హోల్డ్ లో పెట్టరట దర్శకుడు. ఆ తర్వాత మృణాల్ లైన్ లోకి వచ్చిందట. ఇలా పూజా హెగ్డే సీతారామం సినిమాను మిస్ చేసుకుందట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.