Pawan Kalyan: రెండు భాగాలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా.? ఆ మూవీ ఏదంటే..

ఇప్పటికే కేజీఎఫ్ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి సంచలన విజయం అందుకుంది. అంతకు ముందు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా కూడా రెండు భాగాలుగా విడుదలై రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప2 తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అలాగే డార్లింగ్ ప్రభాస్ కూడా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Pawan Kalyan: రెండు భాగాలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా.? ఆ మూవీ ఏదంటే..
Pawan Kalyan

Updated on: Oct 07, 2023 | 10:58 AM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నయా ట్రెండ్ నడుస్తోంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు అన్ని సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమా సక్సెస్ అయితే మాములుగా ఉండదు.. అదే ఫ్లాప్ అయితే యదా మాములే.. అంతే కాదు సినిమాలు రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి సంచలన విజయం అందుకుంది. అంతకు ముందు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా కూడా రెండు భాగాలుగా విడుదలై రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప2 తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అలాగే డార్లింగ్ ప్రభాస్ కూడా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ సినిమా కూడా  రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాకూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే దర్శకుడు కొరటాల శివ ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహరవీరమల్లు సినిమా ఒకటి. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ అనుకోకుండా ఆలస్యం అవుతూ వస్తుంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. హిస్టారికల్ మూవీ కావడంతో ఈ సినిమా కథ చాలా పెద్దగా ఉండనుందట. దాంతో ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.