పవన్ కల్యాణ్‌ను నమ్ముకున్న రెండు వర్గాలున్నాయి. వాటిల్లో ఒకటి ప్రజలు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో అప్పటి నుంచి డిప్యూటీ సీఎంగా.. తనను నమ్ముకున్న ప్రజల కోసం పనిచేస్తున్నారు. కానీ.. ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు.. ఇండస్ట్రీలో కొందరు ప్రొడ్యూసర్లకు ఆయన కాల్షీట్లు ఇచ్చారు. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహరవీరమల్లు వంటివి ఎప్పటి నుంచో ట్రెండిగ్‌లో ఉన్నాయి. నాలుగేళ్లుగా నానుతున్న ఈ సినిమాలను కంప్లీట్ చేస్తారా చెయ్యరా? కడప టూర్‌లో ఉన్న ఆయన అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
అన్నమయ్య జిల్లాలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ అభిమానులు..ఓజీ, ఓజీ అంటూ నినాదాలు చేశారు. సుజిత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ OG సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అభిమానాలు నినాదాలపై స్పందించిన పవన్ కల్యాణ్.. తనకు సినిమాల కన్నా సమాజం, దేశమే ముఖ్యమన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయన్నారు. దాంతో పవన్..ఇక సినిమాలకు పూర్తిగా దూరం జరగనున్నారన్న..ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు..పవన్ కల్యాణ్. దీంతో ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతల పరిస్థితి..నిప్పుల మీద నడకలా ఉంది. అయితే అన్నీ తెలిసే పవన్‌తో సినిమా కమిట్ అయ్యామని..ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమాను పూర్తి చేస్తామంటున్నారు నిర్మాతలు. ఎన్నికలకు ముందు రోజుకు 2 నుంచి 3 కోట్లు తీసుకొని..30 రోజుల్లో సినిమాలు పూర్తి చేశారు పవన్. బ్రో, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు అలా పూర్తి చేసినవే. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో సమయం కేటాయించలేకపోతున్నారు పవన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..