Nivetha Thomas : నివేదా థామస్..2008లోనే బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ.. టాలీవుడ్లో మాత్రం 2016లో అడుగుపెట్టింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్‌మెన్‌తో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది.ఆతర్వాత మరోసారి నానితోనే నిన్నుకోరి సినిమా చేసింది ఈ రేంజు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జై లవకుశ లో అవకాశం దక్కించుకుంది ఈ సినిమా అమ్మడికి మంచి పేరును తెచ్చిపెట్టింది. 118, బ్రోచేవారెవరురా, V, వంటి హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పవన్ సరసన వకీల్ సాబ్ మూవీలోనూ నటిస్తోంది.
అయితే ఈ అమ్మడు సినిమాల విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ సినిమా చేస్తుంది నివేద అయితే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న నివేదకు పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా ఎంత వరకు హెల్ప్ అవుతుంది..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
నాని సుధీర్ బాబులతో కలిసి వి సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తారు విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత అమందికి అవకాశాలు సన్నగిల్లాయని చెప్పాలి. ప్రస్తుతం సాలిడ్ హిట్ పడితే తప్ప ఈ అమ్మడు కెరియర్ మళ్లీ ఉపందుకోదు. ప్రస్తుతం నివేద చేతిలో ఉన్న సినిమా వకీల్ సాబ్ ఈ సినిమా హిట్ అయితే నివేదకు ఆఫర్లు వెల్లువేతే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏంజరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :
Actress Pragathi : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగతి. ఈ సారి ఏకంగా బుల్లెట్ నడిపి షాక్ ఇచ్చింది..