
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతర్వాత చరణ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది.

ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినా.. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈ క్రేజీ బ్యూటీ తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది.

అంతకముందు హిందీలో 'ఎం.ఎస్.ధోని' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీ సినిమాలతోపాటు సౌత్ సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇక ఈ అమ్మడు నటించిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10మా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది కియారా. గేమ్ ఛేంజర్ సినిమా హిట్ అయితే కియారా కెరీర్ టర్న్ అయినట్టే.. తెలుగులోనూ ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తే ఛాన్స్ ఉంది.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారు. అంజలి సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే శ్రీకాంత్, సునీల్, ఎస్ జే సూర్య ఇలా చాలా మంది నటిస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.