సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. అతడు ఖలేజా లాంటి సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇది.ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ ఈ సినిమా మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమానుంచి విడుదలైం ఆ పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి.
ఇక ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ . ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులనంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు పోస్టర్స్ తోనే సరిపెడుతున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు త్వరలోనే ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరితో పాటు మరో హీరోయిన్ కూడా ఉండనుందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్. మహేష్ బాబు సరసన కాజాల్ అగర్వాల్ బిజినెస్ మ్యాన్, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ నటించనుందని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర చాలా చిన్నగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది. పెళ్లి తర్వాత కాజల్ చేస్తున్న సినిమా ఇది. బాలయ్య సినిమాతో పాటు ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో నటిస్తుంది కాజల్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
Randomly saying hello on a Saturday working afternoon 🫶🏻 pic.twitter.com/PSaEzS0yeQ
— Kajal Aggarwal (@MsKajalAggarwal) July 1, 2023
Birthday wishes to the ever-charming @MsKajalAggarwal 😊
May your talent and Charisma continue to captivate audiences on the big screen✨#BhagavanthKesari #NandamuriBalakrishna @sreeleela14 @rampalarjun @MusicThaman @Shine_Screens pic.twitter.com/MeamqAlfSI
— Anil Ravipudi (@AnilRavipudi) June 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.