మరి కొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను ఖుషి చేయడానికి రెడీ అవుతున్నారు. లైగర్ లాంటి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఖుషి. టాలీవుడ్ లో మంచి కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుంది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. విజయ్, సమంత కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఖుషి సినిమా టైటిల్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ టైటిల్. దాంతోనే ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 1న ఖుషి సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.
ఆ రోజు పవర్ స్టార్ క్రేజీ మూవీ గుడుంబా శంకర్ సినిమా రీ రిలీజ్ కానుంది. దాంతో ఖుషి సినిమా కలెక్షన్స్ పై పవన్ కళ్యాణ్ సినిమా ఎఫెక్ట్ పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తున్న విషయం తెలిసిందే.
Telugu States gonna Vibe with this song on September 2 🔥
Ee song ki Theatres Situation thalchukuntene 🙏#GudumbaShankar4Kpic.twitter.com/51JRrAwqLN
— Pawanism™ (@santhu_msd7) August 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.