AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి కోసం దీపికా తెలుగులో మాట్లాడనుందా.?

ఇప్పుడు కల్కి సినిమాలో నటిస్తున్నాడు మన డార్లింగ్. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్స్ కూడా నటిస్తున్నారు.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి కోసం దీపికా తెలుగులో మాట్లాడనుందా.?
Deepika Padukone
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2024 | 7:40 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే సలార్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు ప్రభాస్. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ కొట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు కల్కి సినిమాలో నటిస్తున్నాడు మన డార్లింగ్. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్స్ కూడా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. కల్కి 2898 ఏడీ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకోన్ నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతుంది ఈ అందాల భామ. ఇదిలా ఉంటే ఇప్పుడు దీపికాకు సంబందించిన ఓ వార్త వైరల్ అవుతోంది.

కల్కి సినిమాలో దీపికా పదుకొనె పద్మ అనే పాత్రలో నటించనుందట. అంతే కాదు ఈ సినిమాలో దీపికా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్తుందని అంటున్నారు. ఇందుకోసం తెలుగు నేర్చుకుంటుందట. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా కల్కి సినిమాలో దీపికా పాత్ర చాలా బలంగా ఉంటుందట. ఇక ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కూడా నటిస్తుంది. కల్కి సినిమాలో కీలక పాత్రలో దిశాపటాని కూడా నటిస్తుందట. ప్రస్తుతం ప్రభాస్, దిశాపటాని పై సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట మూవీ టీమ్.  ఇక కల్కి 2898 ఏడీ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకుతీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

నాగ్ అశ్విన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?