Kalki 2898 AD: ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..! కల్కి ప్రమోషన్స్‌కు దీపికా దూరంగా ఉండనుందా..?

|

Apr 29, 2024 | 6:01 PM

ఈ సినిమాలో నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచాన్ని చూపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు.

Kalki 2898 AD: ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..! కల్కి ప్రమోషన్స్‌కు దీపికా దూరంగా ఉండనుందా..?
Kalki2898ad
Follow us on

విడుదలవుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీస్ లో కల్కి సినిమా ఒకటి. కల్కి 2898 AD సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే 9న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. అయితే ఎలక్షన్స్, ఐపీఎల్ హంగామాతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. మరింత ఆలస్యంగా కల్కి సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచాన్ని చూపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు.

కల్కి సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ ఇటీవలే కొత్త పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. అయితే అభిమానుల్లో ఇప్పుడు కొత్త డౌట్ క్రియేట్ అయ్యింది. కల్కి మూవీ ప్రమోషన్స్ కు దీపికా హాజరవుతుందా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు అభిమానుల్లో మొదలయ్యాయి. నటి దీపికా పదుకొణె గతంలో ఈ సినిమా ప్రమోషన్‌కు హాజరవుతారని కమిట్ అయ్యారు. ఇప్పుడు సినిమా విడుదల తేదీని వాయిదా పడటంతో.. ఆమె సినిమా ప్రమోషన్స్ కు వస్తారా.? రారా.? అన్న అనుమానం మొదలైంది.

దీపికా పదుకొణె ప్రస్తుతం గర్భవతి. ఆమె సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. జూన్‌లో ఆమెకు ఆరు నెలలు నిండుతాయి. అటువంటప్పుడు ప్రమోషన్స్ కు రావడం కష్టం కావచ్చు. మరి ‘కల్కి 2898 AD’ ప్రమోషన్స్ లో దీపికా కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి. కడుపుతో ఉండి కూడా దీపికా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సింగం ఎగైన్ అనే సినిమాలో చేస్తుంది. అలాగే కల్కి చేస్తుంది. అశ్వినీదత్ ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు అని టాక్. ప్రభాస్‌, దీపికా తో పాటు దిశా పటానీ కూడా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.