Bhagavanth Kesari: ఓటీటీలోకి వచ్చేస్తోన్న బాలయ్య భగవంత్ కేసరి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

|

Nov 01, 2023 | 10:01 AM

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎప్పటిలానే బాలయ్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భగవంత్ కేసరి సినిమాను అనిల్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కథ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా నటించారు.

Bhagavanth Kesari: ఓటీటీలోకి వచ్చేస్తోన్న బాలయ్య భగవంత్ కేసరి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Bhagavanth Kesari
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎప్పటిలానే బాలయ్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భగవంత్ కేసరి సినిమాను అనిల్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కథ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా నటించారు. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటించింది.

భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురిగా కనిపించింది శ్రీలీల. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడమతో పాటు కలెక్షన్స్ లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ అయిన బగవంత్ కేసరి సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది.

భగవంత్ కేసరి సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భగవంత్ కేసరి సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాను నవంబర్ 23న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. ఇక భగవంత్ కేసరి సినిమా ఇప్పటికే 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

అనిల్ రావిపూడి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

అనిల్ రావిపూడి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.