ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)నటించిన పుష్ప(Pushpa)సినిమా సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యరెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీ విడుదలై అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగాను పుష్ప రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. త్వరలోనే పుష్ప 2 షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు సుకుమార్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే పుష్ప 2 సినిమా పార్ట్ 1కు మించి ఉంటుందని తెలుస్తోంది.
పుష్ప సినిమాలో సునీల్ , ఫహద్ పాజిల్ విలన్స్ గా కనిపించారు. అయితే పార్ట్ 2లో తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కూడా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 కు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 కోసం సుకుమార్ భారీ ప్లాన్ వేశారని తెలుస్తోంది. ఈ సినిమాను ఏకంగా 10 భాషల్లో విడుదల చేయాలని సుకుమార్ చూస్తున్నారట. పుష్ప 1 కు వచ్చిన క్రేజ్ దృష్టిలో పెట్టుకొని సుకుమార్ ఈ మూవీని 10 భాషల్లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. పుష్ప సినిమా 5 భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 ను మరో ఐదు కలిపి 10 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఏ ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి