తెలుగులో అతిపెద్ద గేమ్ షో గా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇప్పటికే వివిధ భాషల్లో టెలికాస్ట్ అవుతూ మంచి సక్సెస్ సాధించింది. ఇక తెలుగులో కూడా విజయవంతంగా ఆరు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అలాగే ఓటీటీలోనూ అలరించింది బిగ్ బాస్. ఇక ఇప్పుడు సీజన్ 7 కు సిద్ధమైంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 మొదలు కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొంతమంది పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ గేమ్ షోలో 20 మంది వరకు పాటిస్పెట్ చేస్తున్నారని తెలుస్తోంది. వీరికి సంబంధించిన పేర్లు ఇప్పటివరకు అఫీషియల్ గా బయటకు రాలేదు కానీ కొంతమంది పేర్లు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లలో.. శుభశ్రీ , సింగర్ దామిని, పూజా మూర్తి, అమర్ దీప్ చౌదరి, కార్తీకదీపం శోభాశెట్టి, ఆట సందీప్ కపుల్, అంజలి పవన్, శ్వేతా నాయుడు, అనీల్ గీలా, శీతల్ గౌతమ్, మహేష్ ఆచంట. పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Brace yourself for a season of twists and turns that flip your perceptions “Ulta Pulta,” guided by ever- charming @iamnagarjuna .Grand Launch on Sep 3rd at 7 PM, followed by Mon-Fri at 9.30 PM & Sat-Sun at 9 PM Only on #StarMaa & @DisneyPlusHSTel #biggbosstelugu7 pic.twitter.com/NXJ0Nary3p
— Starmaa (@StarMaa) August 27, 2023
Yay or Nay?#BiggBossTelugu7 pic.twitter.com/zpM8sQZdka
— ᴍʀ.ʀᴏʏ (@royanenenu) August 21, 2023
షకీలా కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొబ్బరిమట్ట అనే సినిమాలో నటించింది షకీలా. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
#Shakeela adopted daughter (transgender) #Mila is the first confirmed contestant ❤️ (99.9%)#biggbosstamil5 pic.twitter.com/TjyKXKN2ye
— Imadh (@MSimath) April 1, 2021
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.