Abhinaya: హీరోయిన్ అభినయకు కాబోయే భర్త ఇతనే! బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!

|

Mar 17, 2025 | 8:36 PM

పుట్టుకతోనే మూగ, చెవిటి.. అయితేనేం తన అభినయ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచింది నటి అభినయ. పేరులోనే నటనను పెట్టుకున్నఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. కాగా గత కొద్ది రోజులుగా ప్రేమ, పెళ్లి తదితర విషయాలతో వార్తల్లో నిలుస్తోందీ అందాల తార.

Abhinaya: హీరోయిన్ అభినయకు కాబోయే భర్త ఇతనే! బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!
Abhinaya
Follow us on

తమిళనాడుకు చెందిన అభినయ రవితేజ నేనింతే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాలో చిన్న రోల్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అదే రవితేజ నటించిన శంభో శివ శంభో సినిమాతో బాగా ఫేమస్ అయ్యిందీ అందాల తార. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ ల సోదరిగ నటించి అందరి మన్ననలు అందుకుంది. వీటితో పాటు కింగ్, దమ్ము, ధ్రువ, సీతా రామం, గామీ తదితర తెలుగు సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైంది. వీటితో పాటు మార్క్ ఆంటోనీ వంటి డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. తెలుగుతో పాు తమిళ్, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోన్న అభినయ గురించి ఇటీవల కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. ఈ అందాల తార త్వరలోనే పెళ్లిపీటలెక్కుందట. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేసింది అభినయ. అందులో తాను నిశ్చితార్థం జరుపుకొన్నట్లు, ఉంగరాలు మార్చుకొని, గుడిగంటలు కొడుతున్న ఫొటోని పంచుకుంది. దీంతో అభినయకు కాబోయే భర్త ఎవరు? అతను ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి?అని అభిమానులు, నెటిజన్లు తెగ గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభినయకు కాబోయే భర్త గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాదీనే..

అభినయ కు కాబోయే భర్త పేరు కార్తీక్. కొద్ది రోజుల క్రితం ఇతని పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది అభినయ. హైదరాబాద్ కు చెందిన కార్తీక్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. అతను పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచే పరిచయముందని, ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే తమ ప్రేమ, పెళ్లి గురించి అభినయ కానీ, కార్తీక్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇవి కూడా చదవండి

ఎంగేజ్ మెంట్ రింగ్ తో నటి అభినయ..

అభినయ లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్..

గ్లామరస్ లుక్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి