K. Viswanath: పాట రాస్తూనే కుప్పకూలిన విశ్వనాథ్.. మరణానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందంటే..

|

Feb 03, 2023 | 9:54 AM

ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్. గురువారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు.

K. Viswanath: పాట రాస్తూనే కుప్పకూలిన విశ్వనాథ్.. మరణానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందంటే..
Viswanath
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అయిదు నెలల్లో అయిదుగురు దిగ్గజాలను కోల్పోయింది తెలుగు చిత్రపరిశ్రమ. కృష్ణం రాజు .. కృష్ణ .. కైకాల సత్యనారాయణ .. జమున.. వంటి లెజండరీ నటీనటులను కోల్పోయిన వెండితెర.. ఇప్పుడు దర్శకురు కే విశ్వనాథ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్. గురువారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి కొన్ని క్షణాల ముందు పాట రాస్తూ.. ఇక రాయలేక దానిని కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమని చెప్పారట. ఆయన రాస్తుండగానే విశ్వనాథ్ కుప్పకూలిపోయారట.

వెంటనే కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచారు. . ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ విద్య గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశారు.

ఇవి కూడా చదవండి

ఐదు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసిన దర్శకులు కళాతపస్వి విశ్వనాథ్ ఇక లేరన్న వార్త తెలుసుకుని చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కళాతపస్విని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‏లో ఆయన నివాసానికి వెంకటేశ్, మణిశర్మ, గుణశేఖర్, త్రివిక్రమ్, సాయి కుమార్ వంటి ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.