క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు.. అందర్నీ బయటకు లాగుతాం: డీసీపీ విజయ్ కుమార్

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసి, యూత్‌ ఎమోషన్స్‌తో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేస్తున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల భరతం పడుతున్నారు పోలీసులు. అందులోభాగంగానే...యూట్యూబర్లు విష్ణుప్రియ, టేస్టీ తేజను మంగళవారం విచారణకు పిలిచారు. షూటింగ్‌లో ఉన్నాం... మీడియా ఉందన్న సాకుతో వాళ్లు విచారణకు డుమ్మా కొట్టారు.

క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు.. అందర్నీ బయటకు లాగుతాం: డీసీపీ విజయ్ కుమార్
Betting App Scandal

Updated on: Mar 19, 2025 | 10:08 AM

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల.. ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు.
నిన్న రాత్రి పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశంపై ప్రశ్నించారు. యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలాంటి నజరానా పొందారనే వివరాలు రాబట్టారు పంజాగుట్ట పోలీసులు. హీరోయిన్లు హీరోలతో పాటు మరికొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై నిఘా ఉంచారు.

హవాలా రూపంలో.. మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో.. బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్ల మొబైల్ ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేశారు. వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించడంతో పాటు.. టెక్నికల్‌గానూ వారి లొకేషన్లు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. దీని పై వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ టీవీ 9తో మాట్లాడారు..

ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ ద్వారా ఇప్పటికీ 6 మంది చనిపోయారు. బెట్టింగ్ యాప్ ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. బెట్టింగ్ యాప్ వెనకాల ఎంతటి పెద్దవారు ఉన్నా చర్యలు తప్పవు అని డిసిపి విజయ్ కుమార్ అన్నారు. అలాగే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన మిగతా సెలబ్రిటీల పై సుమోటో కింద కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, యూనిఫాంలో ఉంటూ బెట్టింగ్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ పై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. ఇక బెట్టింగ్ యాప్ ముసుగులో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ డొమెస్టిక్ వైలెన్స్ కి పాల్పడ్డాడు. ఇన్ఫ్లుయెన్సర్లు క్షమాపణలు చెప్పిన వారి వల్ల కలిగిన డామేజ్ కు మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయే ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా బెట్టింగ్ వ్యవహారంలో సీరియస్ గా ఉంటాం అని టీవీ9 డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.