Kantara: Chapter 2: దేవుళ్లను అపహాస్యం చేస్తున్నారు.. కాంతార2 సినిమాను అడ్డుకుంటాం..!

|

Feb 11, 2024 | 4:15 PM

కాంతార సినిమాలో దైవ నృత్యం భూత కోల గురించి చూపించారు. సినిమా విడుద‌లైన త‌ర్వాత రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు, దేశంలోని ప్ర‌జ‌ల‌కు తుళు దేశంలోని దేవుళ్ల గురించి తెలిసింది. అయితే  కొంతమంది దైవ నృత్యంను కించపరిచేలా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, కొన్ని సీరియల్స్‌లో దేవుడి వేషధారణతో తుళు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని కొందరు విమర్శలు చేశారు.

Kantara: Chapter 2: దేవుళ్లను అపహాస్యం చేస్తున్నారు.. కాంతార2 సినిమాను అడ్డుకుంటాం..!
Kanthara 2
Follow us on

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 2022లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది చిన్న సినిమాగా వచ్చిన కాంతార ఏకంగా 400కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార సినిమాలో దైవ నృత్యం భూత కోల గురించి చూపించారు. సినిమా విడుద‌లైన త‌ర్వాత రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు, దేశంలోని ప్ర‌జ‌ల‌కు తుళు దేశంలోని దేవుళ్ల గురించి తెలిసింది. అయితే  కొంతమంది దైవ నృత్యంను కించపరిచేలా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, కొన్ని సీరియల్స్‌లో దేవుడి వేషధారణతో తుళు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని కొందరు విమర్శలు చేశారు. రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో ‘కాంతార2’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను అడ్డుకొని తీరుతాం అని కొందరు వార్నింగ్‌ ఇచ్చారు కొందరు.

తాజాగా ఓ సీరియల్‌లో ఓ నటుడు దేవుడి వేషంలో నటించాడు. దీనిపై ఆందోళనకు దిగిన దైవారాధన సంరక్షణ యూత్ ఫోరం మంగళూరు. బజ్పే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన తుళునాడు దైవారాధన సంరక్షణ యువజన వేదిక నాయకులు కొందరు.. దైవారాదన అనేది డబ్బు సంపాదన వ్యాపారంగా మారిందన్నారు. ‘కాంతార 2’ సినిమాపై కూడా నిరసన తెలియజేయబోతున్నాం అని తెలిపారు.

రిషబ్ శెట్టికి దేవుడి గురించి పెద్దగా తెలియదు. ‘కాంతార’ సినిమా తర్వాత దేవుడిని చాలా మంది అపహాస్యం చేస్తున్నారు. పంజుర్లీ అంటే ఎవరో, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలియని వారు అవమానిస్తున్నారు. వీటన్నింటికీ రిషబ్ శెట్టి సమాధానం చెప్పాలి కానీ చెప్పలేదు. ఇప్పుడు ‘కాంతార 2′ చేయబోతున్నాడు. అందులో దేవుడి కథ ఉంటే తప్పకుండా నిరసన తెలుపుతాం, ఆ సినిమాకు వ్యతిరేకంగా నిలబడతాం’ అన్నారు. నలికే, పరవ, పాంబర్ వర్గాలకు చెందిన వారు మాత్రమే దైవ కార్యాలు చేయాలి అని వారు తెలిపారు.  దీని పై కాంతార  టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

రిషబ్ శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

రిషబ్ శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.