Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal: పందెంకోడి ఫామ్‌లోకి వచ్చింది.. కామెంట్ చేసినోళ్లకి అదిరేటి ఆన్సర్..

సినీ హీరో విశాల్‌కు ఏమైంది. ఆయన మునుపటిలా తిరగలేడా...మాట్లాడలేడా...హుషారుగా సినిమాలు చేయలేడా..? అన్నవాటికి సమాధానం దొరికింది. తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌కు ..మాటల్లో కాకుండా..చేతల్లోనే ఆన్సర్‌ ఇచ్చేశాడు విశాల్. ఆయనిచ్చిన ఆన్సర్‌కు ఇన్నాళ్లూ నొరెత్తినోళ్లంతా నోరూముసుకున్నారు. కామెంట్ చేసినోళ్లు కామ్‌గా చూస్తుండిపోయారు. ఇంతకూ విశాల్ ఇచ్చిన జవాబేంటి..? ఇక పందెంకోడి ఫిట్‌నెస్‌ కథ కంచికి చేరినట్లేనా...?

Vishal: పందెంకోడి ఫామ్‌లోకి వచ్చింది.. కామెంట్ చేసినోళ్లకి అదిరేటి ఆన్సర్..
Vishal -Vijay Antony
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 21, 2025 | 3:42 PM

విశాల్‌ ఈజ్ బ్యాక్..అంటూ ఇప్పుడు సోషల్ మీడియా నిండా హోరెత్తుతోంది. కారణం..ఆయన పూర్తిగా ఆరోగ్యంగా కనిపించడమే. ఇప్పుడు మునుపటిలా డాన్సులేస్తున్నాడు..పాటలు పాడుతున్నాడు. స్టేజ్‌షోలతో అదరగొడుతున్నాడు. రెండువారాల కిందట చూసిన విశాల్‌కు… ఇప్పుడు చూస్తున్న విశాల్‌కు చాలా తేడా ఉంది. రెండువారాల కిందట నడవడానికే కష్టపడ్డాడు. మైకు పట్టుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. సరిగ్గా నిలబడలేక తడబడ్డాడు. మాటలు కూడా స్పష్టంగా రానిపరిస్థితి…

విశాల్ నటించిన “మదగదరాజా” సినిమా ఈవెంట్ లో కనిపించిన విశాల్ వీడియో ఇది. ఎప్పుడు ఫిట్ గా, యాక్టివ్ గా ఉండే విశాల్ అనారోగ్యంగా కనిపించడం అందరిని ఆశ్చర్యపరిచింది. చివరికి విశాల్ మైక్ పట్టుకున్నా..చేతులు వణుకుతూ కనిపించాయి. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన పడ్డారు. అయితే విశాల్ కు ఎలాంటి సమస్యలు లేవని, అతను బాగానే ఉన్నారని, కేవలం వైరల్ ఫీవర్ సమస్యతో బాధపడుతున్నాడని చిత్ర బృందం చెప్పింది. డెంగ్యూ రావడం వల్ల విశాల్ పూర్తిగా అలా మారిపోయారని విశాల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది ..కానీ ఎవరూ నమ్మలేదు. విశాల్‌కు ఏదో అయిందని పుకార్లు పుట్టాయి. ఇక మునుపటి విశాల్‌ను చూడలేమా..అన్న చర్చ కూడా జరిగింది. కానీ వాటన్నింటికీ బ్రేక్ వేస్తూ…విశాల్‌ ఇదుగో ఇలా హుషారుగా కనిపించాడు. అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని పరిస్థితుల్లో ఉన్న హీరో విశాల్ ఇప్పుడు డ్యాన్సులు వేస్తూ..సందడి చేశారు.

పందెంకోడి, భరణి, పూజ, పొగరు, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తెలుగులో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. గత సంవత్సరం రత్నం సినిమాలో విశాల్ చివరిసారిగా నటించాడు. ఆ తర్వాత విశాల్ బయట ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే రెండువారాల కిందట ఉన్నట్లుండి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోయాడు. చేతులు కూడా వణుకుతూ కనిపించాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సడెన్‌గా ఇటీవల జరిగిన విజయ్ ఆంటోనీ కన్సర్ట్ లో విశాల్ పాల్గొని మై డియర్ లవరు పాట పాడుతూ డాన్సు చేశాడు. నాక ముక్క” పాటకు స్టెప్పులు వేశారు. తన అభిమాన హీరోను అలా చూసిన అభిమానులు సంతోషంతో కేకలు వేయడం ప్రారంభించారు. మదగజరాజ సినిమా ఈవెంట్ లో జరిగిన విషయంపై..తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలపై హీరో విశాల్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

“ఎలాంటి అడ్డంకులనైనా నా బలంతో అధిగమిస్తాను. ఇప్పుడు నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను, నాకిప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. మీరు నాపై చూపిన ప్రేమను చనిపోయేవరకు మరచిపోలేను. లవ్ యూ ఆల్” అని వ్యాఖ్యానించాడు విశాల్.

ఆయన సన్నిహిత మిత్రుడు, దర్శకుడు నటుడు సుందర్‌ విశాల్ కమ్‌బ్యాక్‌పై మదగరాజ సక్సెస్ ఈవెంట్‌లో అభిమానులతో పంచుకున్నాడు. విశాల్ చాలా త్వరగా కోలుకున్నాడని..మదగరాజ సక్సెస్‌ను విశాల్‌కే అంకితం చేస్తున్నానన్నారు. “మధగజరాజ విజయాన్ని విశాల్‌కి అంకితం చేస్తున్నాను. ఒకరోజు అతను కారులో స్పృహతప్పి పడిపోయాడు. ఆడియో లాంచ్ సందర్భంగా అతని ఆరోగ్యం గురించి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అతని కష్టాలన్నిటికీ ఈ విజయం నా అన్న విశాల్‌కి ఔషధంగా మారింది” అని దర్శకుడు సుందర్‌ చెప్పారు. మొత్తానికి విశాల్ పూర్తిగా కోలుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆట గురించి మాట్లాడండి, నా భోజనం గురించి కాదు: విరాట్ కోహ్లీ
ఆట గురించి మాట్లాడండి, నా భోజనం గురించి కాదు: విరాట్ కోహ్లీ
శాంతి వైపే భారత్ అడుగులు.. వైరం ఎప్పటికీ కోరదు..
శాంతి వైపే భారత్ అడుగులు.. వైరం ఎప్పటికీ కోరదు..
IPL 2025: ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ వీళ్లే భయ్యా
IPL 2025: ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ వీళ్లే భయ్యా
లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వివేకుని మాటే..
లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వివేకుని మాటే..
బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: మోదీ
బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: మోదీ
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఆ కీలక నిబంధనల మార్పు
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఆ కీలక నిబంధనల మార్పు
ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు!సడెన్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు!సడెన్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
ఇది కదా దయాగాడి దండయాత్ర..
ఇది కదా దయాగాడి దండయాత్ర..
మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి..ది బెస్ట్ మూడు బ్యాంకులివే!
మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి..ది బెస్ట్ మూడు బ్యాంకులివే!
ఐపీఎల్‌లో డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే.. కోహ్లీకి మాత్రం నో ప్లేస్
ఐపీఎల్‌లో డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే.. కోహ్లీకి మాత్రం నో ప్లేస్