దైర్యముంటేనే చూడండి..! సీను సీనుకు సుస్సు పడాల్సిందే.. ఈ మూవీ ఎక్కడుందంటే

|

Jul 17, 2024 | 1:23 PM

ప్పటికే వందల సంఖ్యలో హారర్ మూవీస్ వివిధ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఇతర భాషల్లో రిలీజ్ అయిన హారర్ సినిమాలు కూడా తెలుగులో డబ్ ఆయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా చూడాలంటే ధైరం ఉండాల్సిందే.. ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే వెన్నులో ఒణుకు పుడుతుంది.

దైర్యముంటేనే చూడండి..! సీను సీనుకు సుస్సు పడాల్సిందే.. ఈ మూవీ ఎక్కడుందంటే
Horror Movie
Follow us on

ఓటీటీలో వణికించే సినిమాలు చాలానే ఉన్నాయి. హారర్ సినిమాలు చూడటానికి నెటిజన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో హారర్ మూవీస్ వివిధ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఇతర భాషల్లో రిలీజ్ అయిన హారర్ సినిమాలు కూడా తెలుగులో డబ్ ఆయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా చూడాలంటే ధైరం ఉండాల్సిందే.. ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే వెన్నులో ఒణుకు పుడుతుంది. ఇప్పటికీ ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఇంతకు ఈ సినిమా కథ ఏంటంటే.. అంతగా ఈ సినిమాలో బయపడటానికి ఏముందంటే..

ఇది కూడా చదవండి : Aman Preet Singh: రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.. ఆమె మన టాలీవుడ్ క్రీజీ హీరోయినే..

ఈ సినిమాలో.. ఆశ (రేవ‌తి) ఓ స్కూల్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. భ‌ర్త చ‌నిపోవ‌డంతో కొడుకు వినును, పెంచుతుంటుంది. వీరితో పాటు ఆశ అమ్మ కూడా ఉంటుంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అయితే విను ఎంబీబీఎస్ చ‌ద‌వాల‌ని ఆశపడుతుంటాడు. కానీ త‌ల్లి ఆశ‌ బ‌ల‌వంతంగా అత‌డిని బీఫార్మ‌సీలో చేర్పిస్తుంది. చ‌దువు పూర్తిచేసిన విను రెండేళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుంటాడు. కానీ ఒక్క జాబ్ కూడా అతనికి రాదు. దాంతో అతను సొంతఊరు వదిలి మరో ప్లేస్ కు వెళ్లి జాబ్ చేయాలని అనుకుంటాడు. కానీ అతని తల్లి ఆశ అందుకు ఒప్పుకోదు. ఆతర్వాత ఒకరోజు అతని అమ్మమ్మ చనిపోతుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ.. రచ్చ రచ్చ అంటున్న ఫాన్స్

ఆమె చనిపోయిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. విను అమ్మమ్మ చ‌నిపోయిన కొన్ని రోజుల త‌ర్వాత ఇంట్లో వింత శ‌బ్దాలు, కొన్ని ఆకారాలు విను చూస్తాడు. ఇదే విషయం చెప్తే ఎవరూ అతన్ని నమ్మరు. అయితే విను ఫ్యామిలిలో చాలా మంది  మాన‌సిక స‌మ‌స్య‌తో బాధపడుతుంటారు. దాంతో విను కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడని డాక్టర్ చెప్తాడు. ఆతర్వాత కొన్ని సంఘటనలతో వినుతో పాటు ఆశ కూడా ఇంట్లో ఏదో ఉంద‌నే నిజం తెలుసుకుంటుంది. అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది.? అక్కడ ఉన్నది ఏంటి.? వీరి కంటే ముందు ఆ ఇంట్లో ఉన్నవారికి ఏమైంది.?  విను.. ఆశ‌ ప్రాణాల‌తో  బయటపడ్డారా.? లేదా.? అన్న‌దే సినిమాలోనే చూడాలి. ఈ సినిమా పేరు భూత‌కాలం. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.