Meena Dance: మీనా, సంఘవి అదిరే స్టెప్పులు.. చూసేందుకు 2 కళ్లు సరిపోవు

| Edited By: Ravi Kiran

Feb 16, 2023 | 6:18 PM

భర్త చనిపోయాక చాలాకాంలో బాధలో ఉండిపోయిన ఆమె.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. చాలా కాలం తర్వాత డ్యాన్స్‌ వీడియోను షేర్‌ చేశారు.

Meena Dance: మీనా, సంఘవి అదిరే స్టెప్పులు.. చూసేందుకు 2 కళ్లు సరిపోవు
Meena Dance
Follow us on

మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు స్పెషల్‌గా చెప్పేది ఏముంది. చాలా టాలెంటెడ్ నటి. చిన్నప్పటి నుంచి సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉంది. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో ఒకప్పుడు అగ్రనటిగా కొనసాగింది. నటిగా పీక్ స్టేజ్‌లో ఉండగానే బిజినెస్‌మ్యాన్ విద్యాసాగర్‌ను వివాహమాడింది. ఈ దంపతులకు నైకికా అనే పాప ఉంది. ఇటు ఫ్యామిలీని, అటు సినిమాలను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో.. ఆమె జీవితంలో గత ఏడాది కుదుపు ఎదురయ్యింది. జూన్‌ నెలలో అనారోగ్య కారణాలతో మీనా భర్త మరణించారు.

ఆ బాధ నుంచి కోలుకునేందుకు ఆమెకు చాలా టైమ్ పట్టింది. ప్రజంట్ సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యింది. ఫోటోలు, వీడియోలు, రీల్స్ షేర్ చూస్తూ.. తన అభిమానులను సంతోష పెడుతుంది. తాజాగా ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతంది. ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే… మరో సీనియర్‌ నటి సంఘవితో కలిసి ఓ పాటకు సూపర్ స్టెప్పులేసింది. ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం అది చక్కర్లు కొడుతోంది.

‘మీ ఇద్దరిలో ఏ మాత్రం గ్రేట్ తగ్గలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ‘గతాన్ని మర్చిపోయి మీరెప్పుడు సంతోషంగా ఉండాలి మేడమ్’ అంటూ మరో వ్యక్తి మీనాను ఉద్దేశించి రాసుకొచ్చాడు. ‘మీరిద్దర్నీ చూడ్డానికి 2 కళ్లు సరిపోవడం లేద’ని మరో యూజర్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..