10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 5 భారీ చిత్రాలు చేస్తున్న బోల్డ్ హీరోయిన్! ఎవరో తెలుసా?

టాలీవుడ్​ ప్రేక్షకులు ఆమెను 'భలే మంచి రోజు' సినిమాలో చూసి పదేళ్లు అవుతోంది. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమై, బాలీవుడ్‌లో తన బోల్డ్ నటనతో, చురుకైన పాత్రలతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా, రాజ్ కుమార్ రావ్ సినిమా 'భూల్ చూక్ మాఫ్'లో ఆమె ..

10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 5 భారీ చిత్రాలు చేస్తున్న బోల్డ్ హీరోయిన్! ఎవరో తెలుసా?
Reentry Heroine

Updated on: Dec 13, 2025 | 8:24 PM

టాలీవుడ్​ ప్రేక్షకులు ఆమెను ‘భలే మంచి రోజు’ సినిమాలో చూసి పదేళ్లు అవుతోంది. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమై, బాలీవుడ్‌లో తన బోల్డ్ నటనతో, చురుకైన పాత్రలతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా, రాజ్ కుమార్ రావ్ సినిమా ‘భూల్ చూక్ మాఫ్’లో ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు, ఆ బోల్డ్ అండ్ క్రేజీ హీరోయిన్ వచ్చే ఏడాది (2026) ఒక్కసారిగా 5 భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పదేళ్ల విరామం తర్వాత తెలుగులోకి కూడా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు… వామికా గబ్బీ! తెలుగు సినిమాతో పాటు వివిధ భాషల్లో ఆమె చేయబోతున్న ఆ 5 క్రేజీ ప్రాజెక్టులు ఏంటో తెలుసుకుందాం..

Adivi Sesh N Wamiqa

1. ‘గూఢచారి 2 (G2)’

తెలుగు ప్రేక్షకులకు వామికా గబ్బీ మళ్లీ కనిపించబోయే సినిమా ఇదే. అడివి శేష్ భారీ, క్రేజీ ప్రాజెక్ట్ ‘గూఢచారి 2’లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. పదేళ్ల తర్వాత ఆమె తెలుగులోకి ఇవ్వబోతున్న ఈ రీ-ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2. ‘పతి పత్నీ ఔర్ వో’ సీక్వెల్

కార్తీక్ ఆర్యన్ హిట్ సినిమా ‘పతి పత్నీ ఔర్ వో’కు సీక్వెల్ రాబోతోంది. మీడియా కథనాల ప్రకారం, ఈ సినిమాలో వామికా గబ్బీ ముఖ్య పాత్రలో కనిపించవచ్చు. ఇది బాలీవుడ్‌లో ఆమె స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.

3. ‘దిల్ కే దర్వాజే ఖోల్ నా డార్లింగ్’

‘దిల్ కే దర్వాజే ఖోల్ నా డార్లింగ్’ కు వామికా గబ్బీ ఓకే చెప్పింది. ఇందులో ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తుందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

4. ‘టిక్కీ టాకా’

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న ‘టిక్కీ టాకా’ సినిమాలో కూడా వామికా గబ్బీ హీరోయిన్​గా కనిపించనుంది. దక్షిణాదిలో ఆమెకున్న పాపులారిటీ ఈ సినిమాకు కూడా ప్లస్ అవుతుంది.

Wamiqa

5. ‘భూత్ బంగ్లా’

ప్రముఖ హిందీ సినిమా ‘భూత్ బంగ్లా’లో అక్షయ్ కుమార్‌తో పాటు వామికా గబ్బీ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.

కేవలం 2026లోనే 5 సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది వామికా. ఈ అమ్మడు స్పీడ్​ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో అన్ని భాషల ప్రేక్షకులను తన నటనతో, చురుకుదనంతో కచ్చితంగా ఆకట్టుకోనుందనడంలో సందేహం లేదు.