Viva Harsha: కొత్తింటి కల సాకారం చేసుకున్న వైవా హర్ష.. వేడుకగా గృహ ప్రవేశం.. సందడి చేసిన సాయిధరమ్‌ తేజ్‌

|

Aug 31, 2023 | 10:53 AM

ఒక యూట్యూబర్‌గా కెరీర్‌ ఆరంభించాడు హర్ష.. వైవా కాన్సెప్ట్‌తో అతను తీసిన షార్ట్‌ఫిల్మ్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దీంతో అప్పటి నుంచే వైవా హర్షగా పాపులర్‌ అయిపోయాడు. ఈ ట్యాలెంట్‌తోనే సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకున్నాడు. 2013లో మసాలా సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన వైవా హర్ష మైనే ప్యార్‌కియా, పవర్‌, గోవిందుడు అందరివాడేలే..

Viva Harsha: కొత్తింటి కల సాకారం చేసుకున్న వైవా హర్ష.. వేడుకగా గృహ ప్రవేశం.. సందడి చేసిన సాయిధరమ్‌ తేజ్‌
Viva Harsha, Sai Dharam Tej
Follow us on

ప్రముఖ నటుడు, కమెడియన్‌, యూబ్యూట్‌ సెన్సేషన్‌ వైవా హర్ష తన కొత్తింటి కల సాకారం చేసుకున్నాడు. తన భార్యతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టాడు. గృహప్రవేశం సందర్భంగా సంప్రదాయకంగా ఇంట్లో పాలు పొంగించారు హర్ష దంపతులు. మెగా మేనల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ గృహప్రవేశానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వైవా హర్ష దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్తింటి కల సాకారం చేసుకున్న వైవా హర్షకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విషెస్‌ చెబుతున్నారు. ఒక యూట్యూబర్‌గా కెరీర్‌ ఆరంభించాడు హర్ష.. వైవా కాన్సెప్ట్‌తో అతను తీసిన షార్ట్‌ఫిల్మ్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దీంతో అప్పటి నుంచే వైవా హర్షగా పాపులర్‌ అయిపోయాడు. ఈ ట్యాలెంట్‌తోనే సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకున్నాడు. 2013లో మసాలా సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన వైవా హర్ష మైనే ప్యార్‌కియా, పవర్‌, గోవిందుడు అందరివాడేలే, సూర్య వర్సెస్‌ సూర్య, సైజ్‌ జీరో, దోచేయ్‌, శంకరా భరణం, జక్కన్న, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజా ది గ్రేట్‌, నక్షత్రం, జై లవకుశ, తొలి ప్రేమ, తేజ్‌ ఐ లవ్యూ, భానుమతి అండ్‌ రామకృష్ణ సినిమాల్లో నటించి మెప్పించాడు.

‘సుందరం మాస్టర్‌’ సినిమాతో హీరోగా ఎంట్రీ..

సుహాస్‌ నటించిన కలర్‌ ఫొటోలో వైవా హర్ష నటన అందరికీ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్‌లో తన యాక్టింగ్‌తో అందరి చేత కన్నీళ్లు పెట్టించాడీ కమెడియన్‌. ఈ సినిమా తర్వాత మరిన్ని సూపర్‌ హిట్ సినిమాల్లో ఛాన్స్‌లు అందుకున్నాడు. వివాహ భోజనంబు, మంచి రోజులొచ్చాయ్‌, కార్తికేయ 2, బింబిసార, బేబీ, మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ వంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించాడు. కాగా ఇప్పటివరకు కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించిన వైవా హర్ష ఇప్పుడు హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. సుందరం మాస్టర్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మూవీతో సంతోష్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మాస్‌ మహారాజా రవితేజ ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇటీవలే రిలీజైన టీజర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

ఇవి కూడా చదవండి

వైవా హర్ష గృహ ప్రవేశం ఫొటోస్

మెగాస్టార్ చిరంజీవితో వైవా హర్ష 

కార్తికేయ 2 సినిమా సెలబ్రేషన్స్ లో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..