
నిర్మాత, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతని మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నూతన్ చేతిలో మోసపోయినవాళ్లు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. శిరోముండనం కేసుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ పేరుతో ఫేక్ కాల్స్ చేసిన వ్యవహారంలో అతడిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామని నూతన్ నాయుడు చేసిన మోసాలపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఓ బ్యాంక్ డైరెక్టర్ పదవి ఇప్పిస్తామని రియల్టర్ దగ్గర రూ.12 కోట్లు కాజేసినట్టు పోలీసులు విచారణలో తెలిసింది. అదే బ్యాంక్ లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షలు వసూలు చేసినట్టు తేటతెల్లమైంది.
ఇక న్యాయమూర్తి అనుమతితో పోలీసులు నూతన్ నాయుడును కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కస్టడీకి ముందు అతడిని నివాసంలోనే కొద్దిసేపు విచారించారు. ఈక్రమంలో అతను కడుపునొపప్పి డ్రామాకు తెరతీసినట్లు తాజాగా తెలిసింది. అయితే గత అనుభవాలను మైండ్ లో ఉంచుకున్న విశాఖ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కస్టడీలోకి తీసుకున్నారు.
Also Read :