Vikram Movie Review : కమల్ హాసన్ విక్రమ్ మూవీ రివ్యూ.. పక్కా యాక్షన్ ఎంటటైనర్

|

Jun 03, 2022 | 4:37 PM

దేశం గర్వించదగిన నటుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. ప్రయోగాలకు కమల్ మారుపేరు అనే చెప్పాలి. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది.

Vikram Movie Review : కమల్ హాసన్ విక్రమ్ మూవీ రివ్యూ.. పక్కా యాక్షన్ ఎంటటైనర్
Vikram
Follow us on

నటీనటులు: కమల్ హాసన్-విజయ్ సేతుపతి-ఫాహద్ ఫాజిల్- సూర్య – కాళిదాస్ జయరాం

సంగీతం: అనిరుధ్ రవిచందర్

నిర్మాతలు: కమల్ హాసన్-మహేంద్రన్

ఇవి కూడా చదవండి

రచన-దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

దేశం గర్వించదగిన నటుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. ప్రయోగాలకు కమల్ మారుపేరు అనే చెప్పాలి. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. తాజాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు ( శుక్రవారం )ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకోసం కమల్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఈ సినిమాలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి, సూర్య, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఎలావుందంటే..

కథ: 

ప్రభంజన్ (కాళిదాస్ జయరాం) ఓ పోలీస్ ఆఫీసర్.. ఆయన ఓ డ్రగ్ సిండికేట్ కు చెందిన భారీ కొకైన్ ముడి పదార్థాన్ని పట్టుకుంటాడు. దాన్ని ఎవ్వరికి తెలియకుండా దాచేస్తాడు. ఆ ముడి సరుకుతో 2 లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగపడే సరుకు.  ఆ డ్రగ్ సిండికేట్ ను నడిపే సంతానం (విజయ్ సేతుపతి) దానికోసం రంగంలోకి దిగుతాడు.. అలాగే పోలీసులు మరోవైపు వెతుకుతుంటారు. ఇదిలా ఉంటే పోలీస్ ఆఫీసర్ ప్రభంజన్ ను ఓ ముసుగు దొంగలు చంపేస్తారు. ఆ కొద్దిరోజులకే అతడి తండ్రి అయిన కర్ణన్ (కమల్ హాసన్)ను కూడాఅదే ముఠా చంపుతుంది. దాంతో ఆ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు సీక్రెట్ ఏజెంట్ అమర్ (ఫాహద్ ఫాజిల్)ను రంగంలోకి దింపుతారు. అతను తన టీంతో కలిసి ఆ ముఠాను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కర్ణన్ గురించి అతడికి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.. అసలు కర్ణన్ ఎవరు.. ముసుగు ముఠా నాయకుడు ఎవరు.. ఎందుకు హత్యలు చేస్తున్నారు.. అమర్ సంతానం గురించి ఏం తెలుసుకున్నాడు.. అలాగే ఆ డ్రగ్స్ ఏమయ్యాయి..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : 

కమల్ హాసన్ మరోసారి తన నటనతో కట్టిపడేశారు. లోకేష్ తన శైలిలో యాక్షన్.. ఎమోషన్ కలగలిసిన ఆసక్తికర కథను తీర్చిదిద్దుకుని కమల్ స్థాయికి తగ్గ పాత్రను రాసుకున్నారు. అభిమానులను అలరించే రీతిలో ఆయన్ని ప్రెజెంట్ చేసి.. విజయ్ సేతుపతి-ఫాహద్ ఫాజిల్ లను కూడా సరిగ్గా వాడుకుని ‘విక్రమ్’ను ప్రేక్షకులు మెచ్చే సినిమాగా తెరకెక్కించారు. ఫస్ట్ ఆఫ్ లో కమల్ కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే.. ఫ్లాష్ బ్యాక్ లో అలా అలా వచ్చి పోతుంటుంది కమల్ సన్నివేశాలు. ఇతర పాత్రలతో.. సన్నివేశాలతో కమల్ పాత్రకు భారీ ఎలివేషన్ వస్తుంది. ఇక విజయ్ సేతుపతి.. ఫాహద్ ఫాజిల్ పాత్రల నేపథ్యాలు.. నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సేతుపతి మరోసారి తన నటనతో మెప్పించారు. స్టార్టింగ్ లో ట్విస్ట్ ఇస్తూ.. కథను మలుపు తిప్పుతూ.. ఇంటర్వెల్ బ్యాంగ్  కమల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ కు మేజర్ హైలైట్. ఎక్కడా బోర్ అన్న ఫీలింగ్ కలగదు. ఇక ప్రథమార్ధం తర్వాత భారీగా పెరిగే అంచనాలను సెకండ్ ఆఫ్ అందుకుంది. సెకండ్ ఆఫ్ లో కమల్  పాత్ర రివీల్ చేస్తూ.. తన లక్ష్యం ఏంటో చెప్తూ ఆకట్టుకున్నాడు. చెంబన్.. నరేన్.. ఇలా మిగతా నటీనటులంతా బాగానే చేశారు. క్యామియోలో సూర్య మెరిశాడు. మొత్తంగా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా విక్రమ్ నిలిచింది.