Vijay Thalapathy: సింపుల్ అండ్ స్టైలీష్.. కుర్రాళ్లు మనసు పడ్డ విజయ్ దళపతి బ్లూ జాకెట్.. ధరెంతో తెలుసా.. ?

విజయ్ దళపతి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.ఈ హీరో నటించిన చివరి సినిమా జననాయగన్. ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Vijay Thalapathy: సింపుల్ అండ్ స్టైలీష్.. కుర్రాళ్లు మనసు పడ్డ విజయ్ దళపతి బ్లూ జాకెట్.. ధరెంతో తెలుసా.. ?
Vijay Thalapathy

Updated on: Jan 16, 2026 | 10:04 PM

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దళపతి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ విడుదల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఇటీవల జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను మలేషియాలో గ్రాండ్ గా నిర్వహించారు. విజయ్ కు మలేషియాలో లభించిన ఆదరణ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. లక్షల మంది అభిమానులు విజయ్ కోసం ముందుకు వచ్చారు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

మలేషియాకు వచ్చినప్పుడు విజయ్ ధరించిన బ్లూ జాకెట్ అందరి దృష్టిని ఆకర్షించాయి. విజయ్ మలేషియా వెళ్ళినప్పుడు, అతను నీలిరంగు డెనిమ్ జాకెట్ ధరించాడు. దీనిని చూసిన చాలా మంది, ఆ జాకెట్ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు. విజయ్ ధరించిన జాకెట్ GIORGIO ARMAN జాకెట్. ఈ నీలిరంగు డెనిమ్ జాకెట్ ధర దాదాపు రూ.1,24,490. సింపుల్, స్టైలీష్ లుక్ లో కనిపించిన ఈ జాకెట్ గురించి తెలిసి ఆశ్చర్యపరుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..

విజయ్ దళపతి నటించిన జన నాయగన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్ విషయంలో వివాదం నెలకొంది. ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..