Thalapathy 67: విజయ్ దళపతి ‘లియో’ గ్లింప్స్ చూశారా ?.. బ్లడీ స్వీట్ వీడియోకు సూపర్ రెస్పాన్స్..

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కాస్టింగ్, సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువల పరంగా భారీగా ఉండబోతోంది. దలపతి67లో సంజయ్ దత్, త్రిష, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్ , శాండీ మాస్టర్ వంటి ప్రముఖ తారాగణం అలరించబోతోంది.

Thalapathy 67: విజయ్ దళపతి లియో గ్లింప్స్ చూశారా ?.. బ్లడీ స్వీట్ వీడియోకు సూపర్ రెస్పాన్స్..
Leo

Updated on: Feb 04, 2023 | 9:11 AM

సంక్రాంతి బరిలో బీస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆయన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా మాస్టార్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతుండడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు దళపతి ఫ్యాన్స్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కాస్టింగ్, సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువల పరంగా భారీగా ఉండబోతోంది. దలపతి67లో సంజయ్ దత్, త్రిష, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్ , శాండీ మాస్టర్ వంటి ప్రముఖ తారాగణం అలరించబోతోంది.

తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. #దలపతి 67 కి ‘లియో’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. విజయ్ స్టైలిష్ లుక్ తో పాటు అనిరుద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సాగిన ఈ ప్రోమో కి ప్రస్తుతం విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా సూపర్ గా రెస్సాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ ప్రోమో 6 మిలియన్ వ్యూస్ తో పాటు 1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. అలాగే ఈ చిత్రం కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభమైయింది.

ఇవి కూడా చదవండి

ఈ షెడ్యూల్ విజయ్, త్రిషలతో పాటు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రదారులపై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘దలపతి 67’ నటీనటులు, టీంకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us