
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు అగ్ర కథానాయకుడిగా స్టార్డమ్ అందుకున్నారు. ఇటు తెలుగులోనూ విజయ్ సేతుపతికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు విలన్ పాత్రతో పరియమయ్యాడు. ఇందులో హీరోయిన్ తండ్రి రాయనం పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఇచ్చారు మక్కల్ సెల్వన్. షారుఖ్, నయనతార కలిసి నటించిన ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా నిలిచారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఇండస్ట్రీలోకి తన వారసుడిని తీసుకువస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి.. తన కుమారుడు సూర్యను కోలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేయబోతున్నాడు. సూర్య ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించాడు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ అన్ల్ అరసు దర్శకత్వం వహించే కొత్త చిత్రం ఫీనిక్స్‌లో ప్రధాన నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నవంబర్ 24న చెన్నైలో జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా తమిళం, తెలుగు సినిమాల్లోని అగ్ర హీరోలందరితో కలిసి పనిచేసిన అన్ల్ అరసు ఇప్పుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
గతంలో నానుమ్ రౌడీ ధాన్, సింధుబాద్ వంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సూర్య సేతుపతి ఫీనిక్స్ సినిమాతో కథానాయకుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ పతాకంపై రాజలక్ష్మి అరసకుమార్ నిర్మించనున్నారు. యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ వేల్‌రాజ్, ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు.
Another star son rises ! @VijaySethuOffl ‘s son #SuryaVijaySethupathi who has done child artists roles earlier, will debut in the lead in action choreographer #ANLArasu ‘s Directorial debut #Phoenix ! pic.twitter.com/ImPbDjh8VG
— Sreedhar Pillai (@sri50) November 24, 2023
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. తండ్రి విజయ్ సేతుపతి వారసత్వంగా తన ప్రస్థానం కొనసాగించాలని కోరుకోవడం లేదని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటానని.. అందుకే తన పేరును సూర్య విజయ్ సేతుపతి అని కాకుండా కేవలం సూర్య అని మాత్రమే ఉండాలని అన్నాడు. అలాగే తాను హీరోగా పరిచయమవుతుండడం పట్ల తన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.