Allu Arjun: అల్లు అర్జున్- అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా ఫిక్స్! థియేటర్లు దద్దరిల్లుతాయ్!

'పుష్ప 2' బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ సూపర్ హీరో జోనర్‌లోకి అడుగు పెట్టాడు.ఇందులో భాగంగానే అట్లీ దర్శకత్వం లో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నాడీ పాన్ ఇండియా హీరో. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టులో మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది .

Allu Arjun: అల్లు అర్జున్- అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా ఫిక్స్! థియేటర్లు దద్దరిల్లుతాయ్!
Allu Arjun, Deepika Padukone

Updated on: Aug 22, 2025 | 9:28 PM

‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాల తర్వాత, అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బన్నీతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు క్యూలో ఉంటున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం తమిళ దర్శకుడు అట్లీతో చేతులు కలిపాడు. వీరి కాంబినేషన్ లో ఓ హాలీవుడ్ తరహా సినిమా తెరకెక్కనుంది. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సూపర్ హీరో సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం దీపికా పదుకొనే సరిగ్గా 100 రోజుల కాల్షీట్ ఇచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాకు కూడా ఆమె ఇంత పెద్ద కాల్షీట్ ఇవ్వలేదు. ఈ సినిమాపై దీపికకు భారీ అంచనాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఇది దీపిక తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్టులోకి మరో స్టార్ హీరో కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా అల్లు అర్జున్ సినిమాతో ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి గతంలో అట్లీ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘జవాన్’లో విలన్ పాత్ర పోషించాడు. ఈ క్రమంలో బన్నీ మూవీలో కూడా విజయ్ విలన్ తరహా పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది.

అల్లు అర్జున్-అట్లీ చిత్రంలో దీపికా పదుకొనే తో పాటు రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. అయితే వీరు క్యామియో రోల్స్ లోనే కనిపిస్తారని టాక్. మానవులకు, గ్రహాంతరవాసులకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యం లో అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్‌ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. హాలీవుడ్‌లోని అతిపెద్ద VFX కంపెనీలు ఈ చిత్రం కోసం పనిచేయనున్నాయి.

ఇవి కూడా చదవండి

AA 22  అనౌన్స్ మెంట్ గ్లింప్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.