దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ లియో. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా లియో సినిమా రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన లియో సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందో. ఇక ఈ మూవీ ఇప్పటికే 300 కొట్ల వరకు వసూల్ చేసిందని టాక్ వినిపిస్తోంది. దళపతి విజయ్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. అలాగే విజయ్ కు జోడీగా త్రిష నటించింది. అర్జున్, సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. లోకేష్ కానగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ తన ప్రతి సినిమాకు దాని ముందు సినిమాను లింక్ చేస్తున్నాడు దర్శకుడు లోకేష్. అలాగే ఈ సినిమాకు కూడా ముందు సినిమాకు లింక్ పెట్టాడు.
ఇక ఈ సినిమా వారం రోజులకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. లియో’ సినిమా ఇండియాలో మొదటి రోజు రూ.64.80 కోట్లు రాబట్టింది. 2వ రోజు రూ.35.25 కోట్లు వసూలు చేసింది. 3వ రోజు రూ.39.80 కోట్లు, నాలుగో రోజు రూ.41.55 కోట్లు, ఐదో రోజు రూ.35.70 కోట్లు వసూలు చేసింది. 6వ రోజు 32.7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 7వ రోజు సెప్టెంబర్ 25 వసూళ్లు రూ.12 కోట్లు వరకు రాబట్టింది ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా 7 రోజుల్లో 500 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది.
లియో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దళపతి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే లియో సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ లియో సినిమా రైట్స్ ను సొంతం చేసుకుందట. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు లియో ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది.
లియో మూవీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను నవంబరు 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన విడుదల చేయుయనున్నారని తెలుస్తోంది. లియో సినిమాకు పాజిటివ్ టాక్ తో పాటు కొంత నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. కథ కథనంలో బలం లేదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీ టేకింగ్, లోకేష్ డైరెక్షన్, విజయ్ యాక్టింగ్ అదిరిపోయాయని అంటున్నారు చూసిన వారు.
#Leo Mania Everywhere 💥🔥💥🔥❤️🔥❤️🔥 #LeoIndustryHit#NaaReady Vibe Mode On💥💥💥@actorvijay @Dir_Lokesh @anirudhofficial @7screenstudiopic.twitter.com/FpkYdW0iyt
— LEO Movie (@LeoMovie2023) October 25, 2023
#Leo Running Successfully At Kerala!🧊💥💥💥💥💥 #LeoIndustryHit @actorvijay @Dir_Lokesh @MrRathna @anirudhofficial pic.twitter.com/37oO2EimZ3
— LEO Movie (@LeoMovie2023) October 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.