Liger Trailer: రౌడీ హీరో క్రేజ్ అంటే ఇదే మరీ..లైగర్ ట్రైలర్ లాంచ్‏ ఈవెంట్‏లో అభిమానుల హంగామా..

తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి ప్రభాస్ విడుదల చేయగా, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు. హైదరాబాద్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన

Liger Trailer: రౌడీ హీరో క్రేజ్ అంటే ఇదే మరీ..లైగర్ ట్రైలర్ లాంచ్‏ ఈవెంట్‏లో అభిమానుల హంగామా..
Liger

Updated on: Jul 22, 2022 | 2:21 PM

మోస్ట్ అవైయిటెడ్ సినిమా లైగర్. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. నిన్న విడుదలైన లైగర్ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో భారీగా విడుదలైయింది.  అయితే ఈ వేడుకలో విజయ్ అభిమానులు చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ కటౌట్.. పాలాభిషేకాలు, పోతురాజుల నృత్యాలు, బ్యాండ్ మేళంతో సుదర్శన్ థియేటర్ వద్ద రచ్చ చేశారు.

తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి ప్రభాస్ విడుదల చేయగా, మలయాళ ట్రైలర్ ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ విడుదల చేశారు. హైదరాబాద్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్ గా జరిగింది. లైగర్ టీమ్ కి స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్. వేల సంఖ్యలో అభిమానులు హాజరై దారిపొడుగునా పూల వర్షం కురిపించారు. అలాగే థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ భారీ కటౌట్ కి పాలాభిషేకాలు చేశారు. వేడుకలో భాగంగా నిర్వహించిన అమ్మవారి, పోతురాజు ప్రత్యేక నృత్యాలు ఆకట్టుకున్నాయి. లైగర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది.

”ఒక లయిన్ కి టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ” అనే రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం గూజ్ బమ్స్ మూమెంట్స్ తో అద్భుతం అనిపించింది. ఫస్ట్ గ్లింప్స్ లో  లైగర్ ని మాత్రమే పరిచయం చేయగా ట్రైలర్ లైగర్ వైల్డ్ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. ఫైటింగ్ రింగ్ లో విజయ్ చేసిన పోరాటాలు ఎక్స్ ట్రార్డినరీగా  వున్నాయి. ముఖ్యంగా విజయ్ పాత్రకి నత్తి వుండటం బిగ్ సర్ప్రైజ్, ఛాలెంజ్. ట్రైలర్ లో లైగర్ లవ్ లైఫ్ ని కూడా అవిష్కారించారు. ‘ఐ లవ్ యూ’ అనే మాటని లైగర్ చెప్పిన విధానం అవుట్ స్టాండింగా వుంది.” ఐయామ్ ఏ ఫైటర్”అని విజయ్ అంటే.. దానికి బదులుగా ”నువ్వు ఫైటర్ అయితే మరి నేనేంటి ? ”అనే అర్ధం వచ్చేలా మైక్ టైసన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ని ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.