Liger Pre Release Event: విజయ్ కోసం స్టేజ్ పైకి దూసుకొచ్చిన అమ్మాయి.. హీరో రియాక్షన్‏కు ఫ్యాన్స్ ఫిదా..

|

Aug 21, 2022 | 10:27 AM

ఈ సినిమాను ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా శనివారం (ఆగస్ట్ 20న) సాయంత్రం 6 గంటలకు గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

Liger Pre Release Event: విజయ్ కోసం స్టేజ్ పైకి దూసుకొచ్చిన అమ్మాయి.. హీరో రియాక్షన్‏కు ఫ్యాన్స్ ఫిదా..
Vijay
Follow us on

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ (Liger) సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ మొదటిసారి బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య ఈ సినిమాతో సౌత్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ సినిమాను ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా శనివారం (ఆగస్ట్ 20న) సాయంత్రం 6 గంటలకు గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ముఖ్యంగా రౌడీ కోసం అమ్మాయిలు క్యూకట్టారు. విజయ్ ఎప్పుడెప్పుడు స్టేజ్ వద్దకు వస్తాడా అని వెయిట్ చేసిన అమ్మాయిలు.. విజయ్ అంటూ అరుపులతో హోరెత్తించారు. యాటీట్యూడ్ కా బాప్ అంటూ కేకలతో రచ్చ చేశారు. అనంతరం విజయ్ స్పీచ్ ఇస్తున్న సమయంలో అనుహ్య ఘటన జరిగింది.

అభిమానులను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో అనుహ్యంగా ఓ అమ్మాయి స్టేజ్ పైకి దూసుకొచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆ అమ్మాయిని పంపించే ప్రయత్నం చేయగా.. విజయ్ వారిని వారించి.. అమ్మాయితో మాట్లాడి సెల్ఫీ దిగి పంపించారు. అభిమాని పట్ల విజయ్ వ్యవహరించిన తీరుపై ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అనంతరం విజయ్ మాట్లాడుతుండగా.. స్టేజ్ వద్దకు భారీగా ఫ్యాన్స్ వచ్చారు. వారిని జాగ్రత్తగా ఉండాలని రౌడీ సూచించినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం రౌడీని ఫోటోస్ తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది విజయ్‏కు అడ్డుగా నిల్చున్నారు. అనంతరం తన స్పీచ్ తొందరగా ముగించేశారు రౌడీ. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్, విషు కీలకపాత్రలలో నటిస్తున్నారు. చాయ్ వాలా అయిన ఓ కుర్రాడు తన తల్లి కల కోసం బాక్సర్ గా ఎలా మారాడు అనేది లైగర్ స్టోరీ అని ఇటీవలే పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి

Liger

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.