Kushi: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖుషి చేసుకునే న్యూస్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు. డియర్ కామ్రేడ్ సినిమా పర్లేదు అనిపించుకున్నా.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా విజయ్ కు హిట్ కావాలి అంటున్నారు ఫ్యాన్స్.

Kushi: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖుషి చేసుకునే న్యూస్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
Kushi

Updated on: Mar 23, 2023 | 5:16 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు. డియర్ కామ్రేడ్ సినిమా పర్లేదు అనిపించుకున్నా.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా విజయ్ కు హిట్ కావాలి అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మొన్నామధ్య ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకున్నారు.మొన్నామధ్య సమంత అనారోగ్యానికి గురికావడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శివ.

గతంలో శివ దర్శకత్వం వహించిన మజిలీ సినిమాలో సామ్ నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 1న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు విజయ్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.