Vijay Devarakonda In Bollywood Party: విజయ్ దేవరకొండ హీరో పూరీ జగన్నాథ్ దర్శకత్వంతో ‘లైగర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.
పక్కా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ వ్యవహరిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా ముంబై నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో చిత్ర యూనిట్ మకాం మొత్తాన్ని ముంబైకి మార్చేసింది. దీంతో చిత్ర యూనిట్ సైతం పూర్తిగా బాలీవుడ్ టీమ్‌గా మారిపోయింది. నటి, నిర్మాత ఛార్మి సినిమా షూటింగ్ స్పాట్‌తో పాటు చిత్ర యూనిట్‌తో గడుపుతోన్న ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఛార్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. తాజాగా ‘లైగర్’ టీమ్ ఓ పార్టీ చేసుకుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ హీరోయిన్లు.. కియార ఆడ్వాణీ, సారా అలీ ఖాన్ హాజరుకావడం విశేషం. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఛార్మి.. ‘ఈ పార్టీని ఏర్పాటు చేసినందుకు మనీష్ నీకు చాలా ధన్యవాదాలు. పార్టీ ఎంతో సంతోషంగా గడించింది. అమేజింగ్ ఫుడ్, అమేజింగ్ పీపుల్’ అంటూ క్యా్ప్షన్ జోడించింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్య నటిస్తోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో తొలుత సారా నటించినుందని వార్తలు వచ్చాయి. అయితే డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో సారా స్థానాన్ని అనన్య భర్తీ చేసింది.