రౌడీ హీరో విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిల దిల్ క్రష్ ఈ యంగ్ హీరో. సామాన్య ప్రేక్షకులే కాకుండా సెలబ్రెటీస్ సైతం విజయ్ కు అభిమానులున్నారు. ఇక లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు విజయ్. ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగుతోపాటు తమిళం, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు విజయ్. ఇటీవలే హీరోయిన్ అనన్యతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు హీరో. వీరి ఎపిసోడ్ కు సంబంధించిన మరొ కొత్త ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.
అందులో అనన్యను సరదాగా తెలుగులో రిక్వెస్ట్ చేస్తూ కనిపించాడు విజయ్. ” అనన్య నువ్వు చాలా అందమైన అమ్మాయివి.. కానీ నా మీద లైన్ వేయడం ఆపు ” అంటూ విజయ్ తెలుగులో రిక్వెస్ట్ చేస్తుండగా.. చాలా బాగుంది. మళ్లీ ఒకసారి చెప్పు అంటూ అనన్య కోరింది. దీంతో వీరిద్దరి మధ్యలో కరణ్ కల్పించుకుని.. అతను నువ్వు క్యూట్ అని చెబుతున్నాడు. కానీ ఫ్లర్ట్ చేయడం ఆపమంటున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Hitting on each other or not, this jodi is a hit in our hearts! Watch them on the Koffee couch this Thursday! ?☕️
Episode 4 of #HotstarSpecials #KoffeeWithKaranS7, streaming from this Thursday. #KoffeeWithKaranOnHotstar pic.twitter.com/YHPJY1gqsq
— Disney+ Hotstar (@DisneyPlusHS) July 27, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.