Venkatesh’s Narappa : ఆసక్తి పెంచుతున్న ‘నారప్ప’.. సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్న అభిమానులు..

విక్టరీ వెంకటేష్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమా నారప్ప. ఈ సినిమా తమిళ సినిమా అసురన్‌కు రీమేక్‌గా రూపొందుతుంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్‌లో తమిళ స్టార్ హీరో ధనుష్ చేశారు. అక్కడ అసురన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో

Venkatesh's Narappa : ఆసక్తి పెంచుతున్న 'నారప్ప'.. సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్న అభిమానులు..
Narappa

Venkatesh’s Narappa : విక్టరీ వెంకటేష్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమా నారప్ప. ఈ సినిమా తమిళ సినిమా అసురన్‌కు రీమేక్‌గా రూపొందుతుంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్‌లో తమిళ స్టార్ హీరో ధనుష్ చేశారు. అక్కడ అసురన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్‌లో వెంకటేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని విడుదల చేశారు. ఈ సినిమా మే14న ప్రేక్షకులు ముందుకు వస్తుందని ప్రకటించారు.  ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది.

విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఇప్పటివరకు ఓల్డ్ లుక్ గెటప్స్‌తో మెప్పించిన వెంక‌టేష్ ఈ సారి యంగ్ లుక్ లో క‌నిపించి ప్రేక్ష‌కుల్నిస‌ర్‌ప్రైజ్ చేశారు ఈ పోస్టర్ లో.  అయితే  విక్ట‌రి వెంక‌టేష్ యంగ్ లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కుతున్న ‘నారప్ప’ స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ సినిమాతో వెకంటేష్ మరో హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sukumar and Kartikeya : మరోయంగ్ హీరోతో సుక్కు సినిమా.. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై త్వరలో ఆ హీరోతో

Gopichand : ‘సీటీమార్’ సినిమానుంచి జ్వాలారెడ్డి సాంగ్.. మరోసారి మాస్ మాసాల సాంగ్ తో అదరగొట్టిన మ‌ణిశ‌ర్మ