విక్టరీ వెంకటేష్(Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( varun tej) కలిసి నటించిన సినిమా ఎఫ్ 3. ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా నిన్న ( శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరోసారి అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఎఫ్2 కు మించి ఫన్ తో థియేటర్స్ లో కడుపుబ్బా నవ్విస్తున్నారు ఎఫ్ 3 టీమ్. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో చిత్రయూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పాండమిక్ తర్వాత చాల సినిమాలు వచ్చాయి. యూత్, మాసే థియేటర్ కి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి మేము అంతా కలసి ఫ్యామిలీస్ ని థియేటర్ కి రప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఎఫ్ 3తో నెరవేరినందుకు ఆనందంగా వుంది అన్నారు వెంకటేష్. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్ కి వెళ్లి చూసింది ఎఫ్ 3నే. దేవి థియేటర్ లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్ టైనర్ తీసునందుకు సంతోషంగా వుంది. అనిల్ రావిపూడి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ఎఫ్ 3 యూనిట్ అంతా వండర్ ఫుల్ టీం వర్క్ చేసింది. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయాలి” అని కోరుకున్నారు .
అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ” ఎఫ్ 3కి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 చూసిన ప్రేక్షకులు సూపర్, ఎక్స్ ట్రార్డినరీ, అదిరిపోయిందిగా..! అంటున్నారు. ఎక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు, వెంకటేష్ గారికి థ్యాంక్స్. వెంకటేష్ గారితో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేషన్ ని ప్రేక్షకులు ఇంత గొప్పగా ఆదరించడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” అని వరుణ్ అన్నారు.