దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలపై స్పందించిన వెంకటేశ్.. ఏమన్నారంటే

|

Jan 23, 2025 | 1:15 PM

హైదరాబాద్‌ నగరంలోని టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ శాఖ అధికారుల దాడులు జరిగాయి. దిల్‌ రాజు నివాసాలు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు అధికారులు. నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీస్‌, మ్యాంగో మీడియా నిర్మాతలు, వారి కుటుంబీకులు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి

దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలపై స్పందించిన వెంకటేశ్.. ఏమన్నారంటే
Venkatesh, Dil Raju
Follow us on

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఆఫీసులు, ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్, అలాగే మ్యాంగో మీడియా పై కూడా అధికారులు దాడులు నిర్వహించారు. తాజాగా  దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలపై హీరో వెంకటేష్ స్పందించారు . దిల్ రాజు నివాసంపై ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం నాకు తెలియదు అని అన్నారు వెంకటేష్. అలాగే అనిల్ రావిపూడి కూడా ఈ విషయం పై స్పందించారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో దిల్ రాజుపైనే కాదు చాలా మందిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నామని మేము అంటే సంక్రాంతికి వస్తున్నామని ఐటీ వాళ్లు వచ్చారు. ప్రతి రెండేళ్లకోసారి ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణం. నేను సుకుమార్ ఇంటి పక్కన లేను, ఫిబ్రవరిలో వాళ్ల ఇంటి పక్కకు వెళ్తున్నాను. నాపై ఐటీ దాడులు జరగ లేదు అని అనిల్ రావిపూడి అన్నారు. .

దిల్‌ రాజు నివాసాలు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు ఐటీ అధికారులు. నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీస్‌, మ్యాంగో మీడియా నిర్మాతలు, వారి కుటుంబీకులు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిపారు. సోదాల్లో భాగంగా బ్యాంకు లాకర్లను కూడా ఓపన్ చేసి తనిఖీలు చేశారు. కృష్ణానగర్‌లోని దిల్‌రాజు ఆఫీస్‌లో ఐటీ రైడ్స్ జరిగాయి. దిల్‌రాజు ఇటీవల నిర్మించిన సినిమాల బడ్జెట్‌పై అధికారులు ఆరా తీశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.