AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Korean Kanakaraju : కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు.. ఓటీటీ డేట్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న వరుణ్ తేజ్ కు కొరియన్ కనకరాజు రూపంలో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆగస్టు 07న విడుదలైన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. అంచనాలకు మించి వసూళ్లు సాధించి వరుణ్ తేజ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది.

Korean Kanakaraju : కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు.. ఓటీటీ డేట్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే
Korean Kanakaraju
Rajeev Rayala
|

Updated on: Aug 30, 2026 | 6:10 PM

Share

వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా హిట్స్ కోసం వరుణ్ తేజ్ సతమతం అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ అందుకోలేకపోతున్నాడు.. ఈ క్రమంలోనే హారర్ కామెడీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. మంచి బజ్‌తో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంచనాలకు మించి వసూళ్లు సాధించి వరుణ్ తేజ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 60 కోట్ల మేర కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజై మూడు వారాలు గడిచినా కొరియన్ కనకరాజు సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా

ఈ సినిమాలో రితికా నాయర్ హీరోయిన్ గా నటించింది. అలాగే కమెడియన్ సత్య ఈ మూవీ సక్సెస్ లో కీ రోల్ పోషించింది. థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన కొరియన్ కనకరాజు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే  ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. కొరియన్ కనకరాజు సినిమా ఓటీటీ డేట్ వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..

కొరియన్ కనకరాజు సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాంతో సెప్టెంబరు 04 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ అప్‌డేట్ ఇచ్చేసింది. దాంతో ఆడియన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా కొరియన్ కనకరాజు సినిమా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసేయండి.

16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us