Ghani Twitter Review: ప్రేక్షకుల ముందుకు మెగా ప్రిన్స్ ‘గని’.. చూసినవారు ఏమంటున్నారంటే

|

Apr 08, 2022 | 8:53 AM

మెగా ప్రిన్ వరుణ్ తేజ్ నటించిన గని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కోవిడ్ కారణంగా డిలే అయిన ఈ సినిమా మీద మెగా అభిమానుల్లోనే కాదు ఫిలిం సర్కిల్స్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Ghani Twitter Review: ప్రేక్షకుల ముందుకు మెగా ప్రిన్స్ గని.. చూసినవారు ఏమంటున్నారంటే
Ghani Movie
Follow us on

‘Ghani ‘Twitter Review: మెగా ప్రిన్ వరుణ్ తేజ్ నటించిన గని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కోవిడ్ కారణంగా డిలే అయిన ఈ సినిమా మీద మెగా అభిమానుల్లోనే కాదు ఫిలిం సర్కిల్స్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమా చేస్తున్న వరుణ్.. ఈసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2019లో గద్దలకొండ గణేష్‌గా బిగ్ సక్సెస్‌ని ఖాతాలో వేసుకున్నారు వరుణ్ తేజ్‌. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 45 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. అంతకుముందు ఎఫ్ 2, తొలిప్రేమ, ఫిదా సినిమాలు కూడా మంచి సక్సెస్‌లు కావటంతో మీడియం రేంజ్‌ స్టార్స్‌లో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా సెటిల్ అయ్యాడు. దాంతో గని సినిమా పై హై ఎక్స్పెటెషన్స్ పెట్టుకున్నారు మెగా అభిమానులు. గని సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. సునీల్‌శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్‌ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

అల్లు బాబీ, సిద్ధూ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గని సినిమా ఎలా ఉందొ కొందరు ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. గని సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారంటే..

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: హిందీలోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల జాతర.. కొవిడ్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో సినిమాగా..

Anasuya Bharadwaj: కుర్రకారు గుండెలను కొల్లగొడుతున్న యాంకరమ్మ గ్లామర్ షో.. తగ్గేదేలే అంటున్న అను

Sreemukhi: ఖతర్నాక్ పోజులతో కైపెక్కిస్తున్న శ్రీముఖి.. యాంకరమ్మ అందాలకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్