మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతోపాటు.. సన్నిహితులు హజరయ్యారు. అక్టోబర్ 30న కాక్ టైల్ పార్టీతో మొదలైన పెళ్లి వేడుకలలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నితిన్, ఉపాసన, స్నేహారెడ్డి ఫ్యామిలీతో సహా సందడి చేశారు. శనివారం వీరంతా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక పెళ్లికి రాలేకపోయినవారి కోసం.. టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో ఈరోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఈ వేడుకకు పలువురు ప్రముఖులతోపాటు టాలీవుడ్ సెలబ్రెటీలు అంతా విచ్చేశారు. నాగచైతన్య, సునీల్, అలీ, యాంకర్ సుమ తన కొడుకు రోషన్తో కలిసి హాజరయ్యారు. ఇక ఈ వేడుకలలో వరుణ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ సూట్ ధరించగా.. గోల్డ్ కలర్ చమ్కీల చీరలో మరింత అందంగా మెరిసిపోతుంది లావణ్య.
#VarunLav wedding reception at N Convention HYD ! pic.twitter.com/MSYf3HhuLe
— Rajesh Manne (@rajeshmanne1) November 5, 2023
వరుణ్, లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. 2017లో మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు.. ఈ ఏడాది జూన్ లో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.
Megastar #Chiranjeevi entry at #VarunLav Wedding Reception! pic.twitter.com/qQ3MSvmqOF
— Rajesh Manne (@rajeshmanne1) November 5, 2023
#NagaChaitanya at #VarunLav Wedding Reception! pic.twitter.com/rUoK9emmAJ
— Rajesh Manne (@rajeshmanne1) November 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.